. . . తెలంగాణ ప్రభుత్వ సలహాదారుడు మహ్మద్ షబ్బీర్ అలీ
కామారెడ్డి, బతుకమ్మ :
విద్యార్థుల శ్రేయస్సు కోసం ఎల్ల వేళలా కృషి చేస్తానని, తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని తెలంగాణ ప్రభుత్వ సలహాదారుడు మహ్మద్ షబ్బీర్ అలీ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని శ్రీనిధి డిగ్రీ అండ్ పీజీ కాలేజ్, మంజీరా డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ ఆధ్వర్యంలో శనివారం వార్షికోత్సవం నిర్వహించారు. ఈ వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ విద్యార్థుల సర్వతో ముఖాభివృద్ధికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. అనంతరం యూనివర్సిటీ టాపర్లకు అభినందనలు తెలియజేశారు. విద్యార్థులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం హర్షించదగ్గ విషయమని తెలియజేశారు.

అనంతరం కళాశాల చైర్మన్ కేశిరెడ్డి గురువేందర్ రెడ్డి మాట్లాడుతూ విద్యాభివృద్ధిలో మన కళాశాలలు ఎల్లపుడు ముందు ఉంటాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, మార్కెటింగ్ కమిటీ చైర్మన్ లక్ష్మీరాజ గౌడ్, ప్రిన్సిపాల్ విజయ్ కుమార్ గౌడ్, సత్యనారాయణ డైరెక్టర్ మధుసూదన్ రెడ్డి, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.

