డిచ్ పల్లి, బతుకమ్మ :
తెలంగాణ యూనివర్సిటీ బీసీ సెల్ ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిబాఫూలే 200వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన బీసీ సెల్ డైరెక్టర్, యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య ఆరతి మాట్లాడుతూ ఫూలే సేవలను కొనియాడారు. విద్య మాత్రమే సమాజంలోని అసమానతులను దూరం చేయగలరని నమ్మిన ఫూలే సిద్ధాంతాలను విద్యార్థులు పుణికిపుచ్చుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. ఫూలే సత్యశోధక్ సమాజం ఏర్పాటు చేసి దాని ద్వారా సమాజంలో కులవివక్షణను సమర్థవంతంగా ఎదుర్కొన్నారని, మహిళలను చైతన్యం చేయడంలో సఫలీకృతులయ్యారని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని ఫూలే సామాజిక సేవలను కొనియాడారు.