28న చీఫ్ ఎలక్షన్ కమీషనర్ ను తోలిగించాలని కాంగ్రెస్ నిరసనలు
. . . పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్
నిజామాబాద్, బతుకమ్మ:
భారతీయ ఎన్నికల సంఘం చీఫ్ విగ్నేష్ కుమార్ బిజేపి తొత్తుగా పనిచేస్తున్నారని, ఎలక్షన్ కమిషనర్ల అభిప్రాయాలను పట్టించుకోని అతడిని చట్ట సభల్లో అభిశంసించి తీరాల్సిందే అని పీసీసీ చీఫ్ బోమ్మ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. శుక్రవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో విలేఖరులతో పీసీసీ చీఫ్ మాట్లాడుతూ… దేశంలో అర్హులైన ఓట్లు పది సార్లు ఓట్లు వేసిన వారికి కూడా ఎస్ఐఆర్ నోటీసులు ఇవ్వడం ఏమిటన్నారు. అర్హులైన ఓటర్ల ఓట్లు తొలగించే విధంగా విధి విధానాలు రూపొందించడంలో 15 సార్లు ఎక్కువగా తోటి కమిషనర్ లు వ్యతిరేకించిన వాటిని అమలు చేయడం దారుణం అన్నారు. దేశంలో ఓక అత్యున్నత స్వతంత్ర సంస్థ అధిపతి అధికార బీజేపీకి అనుకులంగా వ్యవహరించడం సరికాదన్నారు. కాంగ్రెస్ అగ్ర నేతలు రాహుల్ గాంధి , ప్రియాంక గాంధీ అన్నట్టుగా ఎలక్షన్ కమీషన్ చీఫ్ ను పదవి నుంచి తప్పించి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఎఐసీసీ ఆదేశాల మేరకు సోమవారం హైదరాబాద్ లో, జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టి ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టాలని పిలుపునిచ్చారు.
ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత పై సూప్రీం తీర్పును గౌరవిస్తున్నాం…
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును గౌరవిస్తాం అని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఖైరతబాద్ ఉప ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థి విషయంలో పార్టి నిర్ణయిస్తుందని అన్నారు. రాష్ట్రంలో పార్టీ మారిన మిగిలిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలకు దానం నాగేందర్ అనర్హత కేసు కంటే భిన్నమైనది అన్నారు.
