26.1 C
Hyderabad

రూ.39 లక్షల ధర పలికిన బాలాపూర్ లడ్డూ ప్రసాదం

Balapur Laddu Prasadam fetches a price of Rs 39 lakh.

Must read

📰 Generate e-Paper Clip

 

వెబ్ డెస్క్, బతుకమ్మ :

మూడు దశాబ్ధాలకు పైగా చరిత్ర కలిగిన బాలాపూర్ గణేష్ లడ్డూ రూ.39 లక్షల రికార్డు ధర పలికింది.  లడ్డూ వేలంలో సామా ప్రణీత్ రెడ్డి రూ.39 లక్షలకు దక్కించుకున్నారు.  గతేడాది లడ్డూ వేలంలో రూ.35 లక్షలు పలుకగా ఈసారి మూడు లక్షలు అదనంగా పెరిగింది. బాలాపూర్ లడ్డూ వేలానికి దేశ వ్యాప్తంగా ఓ హిస్టరి ఉంది. 32 సంవత్సరాల క్రితం మొదలైన లడ్డూ వేలం ఇప్పటికి రికార్డు స్థాయిలో ధర పలుకుతూ వస్తోంది. తొలివేలంలో 1994లో రూ.450 వేలంలో కొలను మోహన్‌రెడ్డి లడ్డూ దక్కించుకున్నారు. ఏటా లడ్డూ ధర ఊహించని విధంగా పెరుగుతూ రాగా.. 2025లో దశరథ్‌గౌడ్‌ రూ.35లక్షలకు దక్కించుకున్నారు. క్షణాల్లో పూర్తయ్యే లడ్డూ వేలం కోసం ఈసారి ప్రముఖులు రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. గతేడాది రికార్డు ధరను ఈ ఏడాది వేలం బద్దలు కొడుతుందా అనే సందేహాలు ఇప్పుడు అందరిలో ఆసక్తిని పెంచుతున్నాయి. ఇక గడిచిన 32 ఏళ్లలో బాలాపూర్ లడ్డూ వేలం ధర ఎలా పెరుగుతూ వచ్చింది.ఈసారి అంటే 2026లో 39 లక్షలు పలికింది.

More articles

Latest article