29.3 C
Hyderabad

నిజామాబాద్ గణేష్ శోభాయాత్ర ప్రారంభం

Nizamabad Ganesh immersion procession begins

Must read

📰 Generate e-Paper Clip

 

. . . జండా ఉపి ప్రారంభించేందుకు పోటా పోటీ

 నిజామాబాద్, బతుకమ్మ:

వందేళ్ల చరిత్ర కలిగిన నిజామాబాద్ సార్వజనిక్ గణేష్ మండలి శోభాయాత్ర శుక్రవారం మధ్యాహ్నం అట్టహాసంగా ప్రారంభమైంది. నిజామాబాద్ నగరంలోని పగడాల దుబ్బ లో ప్రతిష్టించిన గణపతి నవరాత్రులు పూర్తి చేసుకున్న తర్వాత సంప్రదాయ బద్ధంగా కర్షకులే హలదారులై, ఎడ్ల జత నిర్వహించే  శోభాయాత్ర( వాహనం) తోపులాట మధ్య ప్రారంభమైంది. గణేష్ నిమజ్జనం సార్వజనిక్ గణేష్ మండలి ఉత్సవ కమిటీ తో కలిసి ప్రజా ప్రతినిధులు ప్రారంభించాల్సి ఉంది జండా ఊపి ప్రారంభించేందుకు పోటా పోటీ నెలకొంది. వినాయక పూజ సందర్భంగా నిర్వహించే చివరి ఘట్టం శోభాయాత్రలో అధిపత్యం కోసం పోటీ పడ్డారు. అధికారికంగా ప్రజా ప్రతినిధులు, అధికారులు ప్రారంభించాల్సిన శోభాయాత్ర జండా కోసం రెండు పార్టీ నాయకుల మధ్య తోపులాట జరిగింది.నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ, నగర మేయర్ ఉమారాణి, ఎమ్మెల్సీ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ లు జండా ఊపడంతో ప్రారంభమైంది. ముందుగా భాలగంగాధర్ తిలక్ విగ్రహానికి నిర్వహకులు పూలమాలలు వేసి వినాయక చవితి ఉత్సవాల రుపకర్తను గుర్తు చేసుకున్నారు…

Nizamabad Ganesh immersion procession begins
 

 

సాంప్రదాయ బద్ధంగా… ఎడ్ల జతలతో శోభాయాత్ర…..

ఇందూర్ నగరంలో సాగే గణేష్ నిమజ్జన శోభయాత్ర సంప్రదాయాలు కొనసాగిస్తూ నగరంలోని పురవీధుల గుండా సాగి చివరకు గణపతి భావి వద్ధ సార్వజనిక్ గణేష్ మండలి గణేష్ ప్రతిమను నిమజ్జనంతో ఈ వేడుకలు ముగియనున్నాయి. ఈ వేడుకల్లో ఆర్ఎస్ఎస్ వారు పద సంచలనం, కోలాటం తో భక్తి శ్రద్ధలతో సాగుతోంది. అర్ధరాత్రి వరకు జరిగే శోభాయాత్రలో 5 అడుగుల గణేష్ ల ప్రతిమలను బావిలో నిమజ్జనం అనుమతించారు.

Nizamabad Ganesh immersion procession begins
 

నగరంలోని గోల్ హనుమాన్ వద్ధ  ఇందూర్ సంస్కార భారతి వారు నిమజ్జన ప్రతిమలకు స్వాగతం పలుకుతున్నారు. నగరంలో నిమజ్జనం సందర్భంగా పోలీసు శాఖ భారీ బందోబస్తు చేపట్టింది. నగరంలోని గాంధీ చౌక్ లో  ఇతర స్వచ్చంధ సంస్థల ఆధ్వర్యంలో ప్రసాధం, పండ్లు, నీళ్లు పంపిణి చెపట్టారు.

Nizamabad Ganesh immersion procession begins
 

 

More articles

Latest article