. . . బెంగళూరు జనాభా పెరుగుదలకు కారణం
. . . కర్ణాటక సీఎం డీకే శివకుమార్ వివదాస్పద వాఖ్యలు
వెబ్ డెస్క్, బతుకమ్మ :
కర్ణాటకలో కొందరు ఎమ్మెల్యేల ఇద్దరు భార్యల రహస్యం పై ఇప్పుడు విస్తృతంగా చర్చ జరుగుతుంది. దీనికి కారణం ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సాక్షాత్ అసెంబ్లీ వేదికగా చేసిన వ్యాఖ్యలు. కర్ణాటకలో కరువు, వర్షాభావం పట్టణీకరణ, తదితర విషయాలపై ఆయన అసెంబ్లీలో సుదీర్ఘ ఉపన్యాసం ఇస్తూ బెంగళూరు జనాభా ఇటీవల దాదాపు 15 శాతం గణనీయంగా పెరిగిపోయిందని అన్నారు. దీనికి కారణం కొంతమంది ఎమ్మెల్యేల రెండు కాపురాలు, ఇద్దరు భార్యల సంసారం కూడా అని చెప్పారు. బెంగుళూరుకి కాపురం మార్చిన కొంతమంది ఎమ్మెల్యేలు , న్యాయవాదులు, ఇతర ప్రముఖులు కూడా ఇద్దరు భార్యల భర్తలుగా తయారయ్యారని, సొంత ఊళ్ళలో ఒరిజినల్ కాపురం బెంగళూరులో రెండో కాపురం.ఇలా కూడా బెంగళూరు జనాభా విపరీతంగా పెరిగిపోయిందని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై ఇప్పుడు మీడియాలో విస్తృతంగా చర్చ జరుగుతోంది. ప్రతిపక్షాలు ఈ వ్యాఖ్యలు ఖండించాయి. కరువు మీద, పట్టణీకరణ మీద, వసతుల మీద మాట్లాడకుండా ఇద్దరు భార్యలు సంసారాలు గురించి మాట్లాడటం ఏమాత్రం సమంజసమో ముఖ్యమంత్రి ఆలోచించుకోవాలని నిలదీశారు.
