బాన్సువాడ, బతుకమ్మ :
ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆరోగ్య వారోత్సవాల ముగింపు కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసన సభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పట్టణ కేంద్రంలోని మాత శిశు సంక్షేమ ఆసుపత్రిలో నిర్వహించిన సమావేశంలో మహాత్మ జ్యోతి రావు పూలే జయంతి సందర్భంగా స్థానిక నాయకులతో కలిసి మహాత్మ జ్యోతి రావు పూలే చిత్రపటానికి పూలతో నివాళులు అర్పించి శ్రద్ధాంజలి ఘటించారు.

అనంతరం ఏప్రిల్ 7న ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ చేతుల మీదుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రూరల్ ఏరియాలో అత్యధికంగా సాధారణ డెలివరీలు జరిగిన ఆసుపత్రిగా అవార్డు పొందిన ఆసుపత్రి వైద్యులను, వైద్య సిబ్బందిని అభినందించారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా డీసీహెచ్ఎస్, ఆసుపత్రి సూపరిండెంట్ డా. విజయ భాస్కర్, డిప్యూటీ డీఎంహెచ్ఓ డా.విద్యా, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ అధ్యక్షులు, పట్టణ ప్రజాప్రతినిధులు, నాయకులు, ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.

