29.6 C
Hyderabad
Sunday, August 2, 2026

రేవంత్ రెడ్డి బీసీ డిక్లరేషన్ హామీ ఏమైంది

Must read

📰 Generate e-Paper Clip

  • టీఆర్పీ జిల్లా అధ్యక్షుడు తాహెర్

 

కామారెడ్డి, బతుకమ్మ : బీసీ రిజర్వేషన్ల అంశంపై కాంగ్రెస్ పార్టీ రెండు నాలుకలు మాట్లాడుతోందని తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టీఆర్పీ) కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు తాహెర్ ఘాటుగా విమర్శించారు. బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రిజర్వేషన్ల విషయంలో ప్రభుత్వం చూపిస్తున్న వైఖరి పూర్తిగా అన్యాయమంటూ మండిపడ్డారు. జిల్లాల వారీగా నోటిఫికేషన్లు వెలువడినప్పటికీ, బీసీలకు న్యాయం చేయాలనే ఉద్దేశ్యం ప్రభుత్వంలో లేదని తాహెర్ ఆరోపించారు. జీవో నంబర్ 46 ప్రకారం 50 శాతం రిజర్వేషన్లు అమలు చేయాల్సి ఉండగా, ప్రభుత్వం గెజెట్ విడుదల చేసినా, అమలు విషయంలో ధీమా లేదని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత ఎన్నికల సందర్భంగా కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ చేస్తానని ఇచ్చిన భారీ హామీ ఏమైందని ఆయన ప్రశ్నించారు. బీసీలను ఎప్పటికప్పుడూ ఆశ్వాసాలతో మోసం చేస్తూ వస్తున్న కాంగ్రెస్ పార్టీ అసలు ఉద్దేశ్యమే బీసీలను బలహీనపరచడమేనని ఆరోపించారు. అగ్రవర్ణ కులాల చేతుల్లో బీసీ వర్గాలు దశాబ్దాలుగా అణిచివేతకు గురయ్యామని, ఇప్పటికైనా బీసీ వర్గాలంతా ఐక్యంగా పోరాడాల్సిన సమయం వచ్చిందని తాహెర్ పిలుపునిచ్చారు. తీన్మార్ మల్లన్న నాయకత్వంలో బీసీలకు పునరుజ్జీవన పోరాటం ప్రారంభమైందని, ఈ పోరాటాన్ని ప్రతి గ్రామంలో, ప్రతి వాడలో విస్తరించాలని సూచించారు. అగ్రవర్ణాల అణచివేతకు ఇప్పటినుంచే చెక్ పెట్టకపోతే భవిష్యత్తులో బీసీ వర్గాలకు న్యాయం మరింత దూరమైపోతుందని హెచ్చరించారు. ఈ సందర్భంగా టీఆర్పీ ప్రధాన కార్యదర్శి బొక్కల సంతోషి మాట్లాడుతూ, రాబోయే సర్పంచ్ ఎన్నికల్లో బీసీ అభ్యర్థులు అధిక సంఖ్యలో పోటీ చేసి గెలుపొందాలంటే ప్రతి బీసీ కుటుంబం చైతన్యవంతం కావాలని అన్నారు. బీసీ యువత తమ సామాజిక వర్గ శక్తిని అర్థం చేసుకుని ప్రతి ఇంటిలో అవగాహన కల్పించాలని సూచించారు. బీసీల ఓటు ఒక శక్తి, ఆ శక్తిని సక్రమంగా వినియోగిస్తే రాజకీయాల్లో శాశ్వత మార్పు తథ్యమని తెలిపారు. సర్పంచ్ ఎన్నికలు కేవలం స్థానిక స్వరాజ్య వ్యవస్థకు సంబంధించినవే కాకుండా, బీసీ వర్గాల భవిష్యత్తును నిర్ణయించే కీలక సమయమని బీసీ వర్గాలు విభజనకు లోను కాకుండా ఒకే తాటిపై నిలబడితేనే సర్పంచ్ పదవులు పెద్ద సంఖ్యలో బీసీలకు దక్కుతాయని పేర్కొన్నారు. రాబోయే సర్పంచ్ ఎన్నికల్లో బీసీల పాత్ర, అభ్యర్థుల ఎంపిక, గ్రామ స్థాయి ప్రచార వ్యూహం, ఓట్ల విభజన నివారణపై విస్తృత చర్చ జరిగింది. బీసీ వర్గాల శక్తిని ఏకం చేస్తేనే సర్పంచ్ స్థానాల్లో బీసీ అభ్యర్థులు అప్రతిహతంగా గెలవగలరన్న అభిప్రాయం సాధారణమైంది. ఈ సమావేశంలో కామారెడ్డి మండల అధ్యక్షుడు సిద్ధరాములు, రాజంపేట మండల అధ్యక్షుడు మెత్తల అనిల్ పటేల్, బీబీపేట మండల అధ్యక్షుడు మేడుదుల కాషా గౌడ్, బిక్నూర్ మండల అధ్యక్షుడు సిరిగాదా చంద్రకిరణ్, పాల్వంచ మండల అధ్యక్షులు  వివిధ మండల పాల్గొన్నారు.

More articles

Latest article