రేవంత్ రెడ్డి బీసీ డిక్లరేషన్ హామీ ఏమైంది

టీఆర్పీ జిల్లా అధ్యక్షుడు తాహెర్   కామారెడ్డి, బతుకమ్మ : బీసీ రిజర్వేషన్ల అంశంపై కాంగ్రెస్ పార్టీ రెండు నాలుకలు మాట్లాడుతోందని తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టీఆర్పీ) కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు తాహెర్ ఘాటుగా విమర్శించారు. బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రిజర్వేషన్ల విషయంలో ప్రభుత్వం చూపిస్తున్న వైఖరి పూర్తిగా అన్యాయమంటూ మండిపడ్డారు. జిల్లాల వారీగా నోటిఫికేషన్లు వెలువడినప్పటికీ, బీసీలకు న్యాయం చేయాలనే ఉద్దేశ్యం ప్రభుత్వంలో లేదని తాహెర్ ఆరోపించారు. జీవో నంబర్ 46 ప్రకారం 50 శాతం రిజర్వేషన్లు అమలు చేయాల్సి...