27.6 C
Hyderabad
Sunday, August 2, 2026

పోలింగ్ బూత్ లను పరిశీలించిన ఎంపీడీవో తిరుమల

Must read

📰 Generate e-Paper Clip

మోర్తాడ్, బతుకమ్మ: స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగిన విషయం తెలిసిందే. దీంతో ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కావడంతో మోర్తాడ్ ఏం పీ డీ వో తిరుమల దేవి బుధవారం మోర్తాడ్ మండలంలోని షేట్ పల్లీ, ధర్మోరా, డోన్ కల్, గాండ్ల పేట్ తదితర గ్రామాల్లో గల పోలింగ్ కేంద్రాలను ఆమె పరిశీలించారు. ఎన్నికలు నిర్వహించనున్న ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న ప్రతి గదిలో ఉన్న అన్ని సదుపాయాల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఏటువంటి సమస్యలు ఉన్న తన దృష్టికి తీసుకురావాలని తెలియజేశారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి ప్రశాంత్, గురిజల నర్సారెడ్డి, ప్రధానోపాధ్యాయుడు వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article