నవీపేట్, బతుకమ్మ :
ప్రభుత్వ విద్యాలయాల బలోపేతం, ప్రైవేట్ స్కూళ్లలో ఫీజుల నియంత్రణ చేపట్టాలన్న డిమాండ్లతో తెలంగాణ పీపుల్స్ ఫ్రంట్ బస్సు యాత్ర నిజమబాద్ జిల్లాకు చేరుకుంది. రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి నేతృతంలో బస్సుయాత్ర శుక్రవారం రాత్రి నవిపేట మండలం అబ్బాపూర్ గ్రామంలో బస్తీబాట నిర్వహించారు. స్థానిక ప్రభుత్వ స్కూళ్లలోని సమస్యలను ఆకునూరి మురళి బృందం పేరెంట్స్, స్టూడెంట్స్ ను అడిగి తెలుసుకున్న తెలుసుకున్నారు. ఇదే గ్రామంలోని మండల పరిషత్ పాఠశాలలో బడి నిద్ర చేసింది.
