26.4 C
Hyderabad

విద్యా వైద్యం సేద్యం ఇది ప్రజల ఆకాంక్ష

Education, healthcare, and agriculture—these are the people's aspirations.

Must read

📰 Generate e-Paper Clip

. . . భూ కబ్జాలపై ఉన్న శ్రద్ధ విద్యపై లేదు

. . . విద్యా కమిషన్ మాజీ చైర్మన్ ఆకునూరి మురళి

నిజామాబాద్, బతుకమ్మ:

నాణ్యమైన విద్య అందించేంతవరకు ప్రతి ఒక్కరూ ప్రశ్నించాలని అందరూ కలిసి ప్రభుత్వాన్ని నిలదీయాలని అప్పుడు మాత్రమే వారు వైఖరి మార్చుకొని,నాణ్యమైన విద్య అందించేందుకు ముందుకు వస్తారని తెలంగాణ విద్యా కమిషన్ మాజీ చైర్మన్ , మాజీ సినియర్ ఐఎఏస్ అధికారి ఆకునూరి మురళి అన్నారు. తెలంగాణ ప్రజా ఫ్రంట్ ఆధ్వర్యంలో చేపట్టిన విద్యా బస్ యాత్రలో భాగంగా శనివారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పెన్షనర్స్ భవనంలో లో మేధావులు,,విద్యావేత్తలు,విద్యార్థి సంఘాలు,ప్రజాసంఘాల నాయకులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిం చారు. ఈ సందర్భంగా మురళి మాట్లాడుతూ… రూ. 3 లక్షల కోట్ల బడ్జెట్ ఉన్న రాష్ట్రంలో స్కూళ్లకు ఇవ్వడానికి రూ.6 వేల కోట్లు లేవా అని ప్రశ్నించారు.మూడు లక్షల రాష్ట్ర బడ్జెట్లో ప్రతి సంవత్సరం రూ.6 వేల కోట్లు ఇస్తే 2 వేల స్కూళ్లు బాగుపడుతాయని ఆయన అన్నారు. బీఆర్ఎస్ హయాంలో లెక్కకు మించి భూ కబ్జాలు జరిగాయని,విద్యను విస్మరిస్తూ ఎన్నికల కొరకు కొన్ని ప్రాజెక్టులను ప్రారంభించి లబ్ది పొందారని, డబల్ బెడ్ రూములు,ప్రాజెక్టులు ఈ కోవకే చెందుతాయని,ఆయన పెర్కోన్నారు. యూనివర్సిటీల్లో ఖాళీలు ఎందుకు నింపడం లేదని నిలదీశారు. ప్రైమరీ స్కూల్స్ లో ఒకే టీచర్ అనేక తరగతులకు బోధిస్తుండడం తో నాణ్యమైన విద్య అందడం లేదన్నారు. దీంతో ప్రజలు తమ పిల్లలను ప్రైవేట్ స్కూళ్లకు పంపి స్తున్నారన్నారు. రిటైర్డ్ సీనియర్ ఐఏఎస్ అధికారి చంపాలాల్ మాట్లాడుతూ… దేశంలో 11.5 లక్షల స్కూళ్లు ఉంటే.. పీఎం శ్రీ స్కీం కింద 6,500 స్కూళ్లను మాత్రమే అభివృద్ధి చేస్తున్నారని ఈ లెక్కన మొత్తం స్కూళ్లు అభివృద్ధి చేయాలంటే 350 ఏండ్లు పడుతుందన్నారు. అధికారంలో ఉన్నవారు సొంత ప్రయోజనాలు,భూకబ్జాలు వీటిపైనే కేంద్రీకరిస్తున్నారని విద్య వైద్యం పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారని అన్నారు. నిజామాబాద్ సిటీ డెవలప్మెంట్ కమిటీ ప్రధాన కార్యదర్శి కె. రామ్ మోహన్ రావు,పెన్షనర్స్ యూనియన్ నాయకులు ఎల్ శ్రీధర్ ల అధ్యక్షత జరిగిన ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో టీపీఎఫ్ సభ్యులు ప్రొఫెసర్ పద్మజాషా,డాక్టర్ పాలకుర్తి జగదీశ్వర్,ఎన్. రుబీనా,సృజన యాదవ్,డాక్టర్ సూరి,వాసు,ప్రసాద్ రావు,హుస్సేన్,వెంకటేశ్వరరావుతదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article