25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

జిటిఏ నార్త్, సౌత్ అర్బన్ కార్యవర్గం ఎన్నిక

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘం జిటిఏ నార్త్, సౌత్ అర్బన్ కార్యవర్గం బుధవారం ఎన్నికున్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘం జిల్లా కార్యవర్గ సమావేశం జిల్లా అధ్యక్షులు సాయి రెడ్డి అధ్యక్షతన, కృపాల్ సింగ్ సోడి ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు ఉపాధ్యాయ సమస్యలను తీర్మానించి ప్రాతినిధ్యం చేసి పరిష్కరించుటకు నిర్ణయించారు. నూతన పిఆర్సి అమలు చేయాలని, పెండింగ్ డిఏలు విడుదల చేయాలని, టెట్ మినహాయింపు ఇవ్వాలని, పెన్షన్ బెనిఫిట్స్ చెల్లించాలని, ఈ హెచ్ ఎస్ సౌకర్యం కల్పించాలని, డి సి ఈ బి కార్యదర్శిని తొలగించి నూతన కార్యదర్శిని నియమించాలని, ఈ మధ్యకాలంలో ప్రమోషన్ పొందిన ఉపాధ్యాయులకు క్రమబద్ధీకరణ చేయాలని, ఎఫ్ ఆర్ ఎస్ ను తొలగించాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. సమావేశం అనంతరం నూతన అర్బన్ సౌత్, నార్త్ ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘం కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.

  • ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘం అర్బన్ సౌత్ కార్యవర్గం..

అధ్యక్షులుగా బి.గంగాధర్ వాటర్ ట్యాంక్, ప్రధాన కార్యదర్శిగా ఎండి ఖజానాసరుద్దీన్, ఉపాధ్యక్షుడిగా చందు జిపిఎస్ శివాజీ నగర్, సంయుక్త కార్యదర్శులు గా కే.నవీన్ ఎస్ ఏ జిహెచ్ఎస్ ఖిల్లా, ఎండి ఫజల్ ఉల్లా జిహెచ్ఎస్ దారు గల్లి లను, ఆర్థిక కార్యదర్శిగా కే.అనిల్ జిపిఎస్ జెండా గల్లి, సుచిత్ర ఎస్జిటి జిపిఎస్ ఖిల్లా ను మహిళా అధ్యక్షురాలుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

  • ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘం జిటిఏ అర్బన్ నార్త్ కార్యవర్గం..

అధ్యక్షుడిగా నాగారావు స్కూల్ అసిస్టెంట్ జిహెచ్ఎస్ దుబ్బ, ప్రధాన కార్యదర్శిగా ఫజరుల్లా ఖాన్ జిపిఎస్ సతీష్ నగర్, ఉపాధ్యక్షులుగా నగేష్ ఫిజికల్ డైరెక్టర్ జి హెచ్ ఎస్ అర్షపల్లి, ఇర్ఫాన్ స్కూల్ అసిస్టెంట్ జిహెచ్ఎస్ ఖలీల్ వాడి, సంయుక్త కార్యదర్శిగా ఎస్ సాయిలు స్కూల్ అసిస్టెంట్ జిహెచ్ఎస్ పోలీస్ లైన్, ఆర్ శ్రీనివాస్ స్కూల్ అసిస్టెంట్ జిహెచ్ఎస్ దుబ్బ, మహిళా అధ్యక్షురాలుగా రానా తపస్సుం మిర్చి కాంపౌండ్ ఉర్దూ మీడియం, ఎం శంకర్ ఆర్థిక కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

GTA North and South Urban Executive Committee Election

More articles

Latest article