ఈసారీ పాత వారికే..

0 3,687
  • నామినేటెడ్, కార్పొరేషన్ పదవులు వారికే
  • ఉమ్మడి జిల్లాలో ఇప్పుడు ఇదే ట్రెండ్

నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పాత కాపులకే ప్రాధాన్యత ఇస్తుంది. ఎంతపెద్ద తోపులు ఐనా, ఏ పార్టీ నుంచి వచ్చిన సరే పార్టీ కోసం కష్టకాలంలో వెన్నంటి ఉన్నవారికి పదవుల పంపకాలలో వారికే తొలి ప్రాధాన్యత అని చెప్పకనే చెబుతుంది. అందుకు నిజామాబాద్ పాత జిల్లాలో జరుగుతున్న వివిధ పాలకవర్గాల పదవులలో ఈ విషయం స్పష్టమౌతుంది. దశాబ్ధకాలం అధికారానికి దురంగా ఉన్న కాంగ్రెస్ జండాను నమ్మిన వారికే పదవుల పంపకాలలో ముందు వరుసలో ఉంచి కట్టబెడుతుంది. మూడు రోజుల క్రితం జరిగిన ఉమ్మడి ఇందూర్ జిల్లా సీనియర్ కాంగ్రెస్ నాయకుల తో పార్టీ వ్యవహరాల ఇంచార్జీ దీప్ దాస్ మున్షి, రాష్ర్ట నూతన అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ లతో జరిగిన సమీక్ష సమావేశంలో ఇదే విషయంను స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇదే విషయంను ప్రస్తుతం జరుగుతున్న పదవుల పందేరం విషయంలో గుర్తు చేస్తున్నారు.
రాష్ర్ట పిసీసీ చీఫ్ గా బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ కు రాష్ర్ట భాధ్యతల అప్పగింతకు ముందునుంచి జిల్లాకు నామినేటేడ్ కార్పోరేషన్ పదవులు అని కాంగ్రెస్ సీనియర్ లకు దక్కాయి. ముందుగా పీసీసీ వర్కింగ్ ప్రేసిడేంట్ గా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ కు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించింది. అర్బన్ ఎమ్మెల్యే స్థానంను షబ్బిర్ ఆలీకి త్యాగం చేసినందుకు మహేష్ కు మార్ గౌడ్ కు శాసన మండలి సభ్యునిగా, రాష్ర్ట ఉపాధ్యక్షులు తాహేర్ బిన్ హందాన్ కు ఉర్ధు అకాడమీ చైర్మెన్ గా, ఎమ్మెల్యే స్థానాలను త్యాగం చేసిన డిసీసీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డికి రాష్ర్ట కో ఆపరేటివ్ యూనియన్ సోసైటి చైర్మెన్ గా, రాష్ర్ట కిసాన్ ఖేత్ అధ్యక్షులు అన్వేష్ రెడ్డి కి రాష్ర్ట సీడ్ డేవలప్ మెంట్ చైర్మెన్ గా, ఈర వత్రి అనిల్ కు స్టేట్ మైనింగ్ కార్పొరేషన్ చైర్మెన్ గా, బాన్సువాడ కు చెందిన కాసుల బాలరాజ్ కు అగ్రోస్ ఇండస్ర్టీస్ చైర్మెన్ ఫదవులను అప్పగించింది. మాజీ మంత్రి షబ్బిర్ ఆలీకి రాష్ర్ట ప్రభుత్వ సలహదారుగా నియమించింది. తాజాగా నుడా చైర్మెన్ గా నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కేశ వేణు, డిసిసి ఉపాధ్యక్షులుగా ఉన్న అంతరెడ్డి రాజారెడ్డికి గ్రంథాలయ సంస్థ చైర్మెన్ గా నియమాకాలు జరుగుతున్నట్టు ప్రచారం జరగుతుంది. తాజాగా నిజామాబాద్ మార్కెట్ కమిటి చైర్మెన్ జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు ముప్పా గంగారెడ్డిని నియమించడంతో ఈ వాదానలకు బలాన్నిచ్చింది. ఇప్పటి వరకు నియమితులైన వారు అంతా కాంగ్రెస్ వారే.
తాజాగా కాంగ్రెస్ పార్టీలో ముసలంకు కారణాలు ఉన్నాయి. బాన్సువాడ నియోజకవర్గంలో ఏనుగు రవింధర్ రెడ్డి వర్సేస్ పోచారం అన్న రాజకీయం జరగుతుంది. అదే సమయంలో అక్కడ బిఆర్ఎస్ నుంచి గెలిచిన మాజీ సభాపతి పోచారం కాంగ్రెస్ లో చేరడంలో ఆ నియోజకవర్గంలో పాత కాంగ్రెస్ కొత్త వలస కాంగ్రెస్ అనే గొడవలు షురూ అయ్యాయి. అలాంటి సమయంలో పోచారానికి కాంగ్రెస్ అధిష్టానం వ్యవసాయ శాఖ ప్రభుత్వ సలహదారుగా నియమించింది. గతంలో బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన కుంట రమేష్ రెడ్డికి డిసిసిబి చైర్మెన్ గా, తారా చంద్ నాయక్ కు ఐడిసియంఎస్ చైర్మెన్ పదవులను కట్టబెట్టింది. ఈ వ్యవహరం సీనియర్ కాంగ్రెస్ నాయకులు నొచ్చుకున్నారు. దానితో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇక నుంచి జిల్లాలో నామినేటేడ్, కార్పోరేషన్ పదవులలో జిల్లాలో పాత నేతలకే ప్రాధాన్యత అనే విషయంను చెప్పి అమలుకు శ్రీకారం చుట్టింది. ఇప్పుడు జిల్లాలో 17 మార్కెట్ కమిటిల చైర్మెన్ పదవులతో పాటు ఇతర డైరెక్టర్ పధవులు అన్ని కాంగ్రెస్ జండాను మోసినవారికే ఇవ్వాలని తీర్మాణం చేసింది. అందులో భాగంగానే ఇప్పుడు మార్కెట్ , నుడా పదవులను ఇతర కార్పొరేషన్ ల డైరెక్టర్ ల నియామకాలలో కాంగ్రెస్ కార్యకర్తలకు ఇవ్వనుంది.

Leave A Reply

Your email address will not be published.