23.3 C
Hyderabad
Saturday, August 1, 2026

పోక్సో కేసులో ఇద్దరు ఉపాధ్యాయులు అరెస్ట్

Must read

📰 Generate e-Paper Clip

  • ఓ మాజీ ప్రజాప్రతినిధి కూడా..

భిక్కనూర్, బతుకమ్మ : కామారెడ్డి  జిల్లా భిక్కనూర్ మండలంలో పోక్సో కేసులో పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు. ఇద్దరు ప్రభుత్వ ఉపాధ్యాయులతో పాటు ఓ మాజీ ప్రజా ప్రతినిధి ఉన్నారు. కామారెడ్డి  జిల్లా కోర్టులో ముగ్గరిని శుక్రవారం ప్రవేశ పెట్టగా 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. మండల పరిధిలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థిని పట్ల ఒక ఉపాధ్యాయుడు అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ విషయాన్ని బయటకు పొక్కకుండా పాఠశాల ఉపాధ్యాయులు, మాజీ సర్పంచ్ రాజీ చేశారు. కొద్ది రోజులకు న్యాయ సేవాధికార సంస్థ ప్రతినిధులు వచ్చి బాధిత కుటుంబీలను విచారించారు. దీంతో బాధిత కుటుంబ సభ్యులు న్యాయ సేవాధికార సంస్థ ప్రతినిధులకు జరిగిన విషయాన్ని వివరించారు. సంస్థ ప్రతినిధులు విచారణ జరిపి నిందితుపై కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసు  విచారణను కామారెడ్డి  డీఎస్పీకి బదులుగా ఎల్లారెడ్డి డీఎస్పీ పూర్తి చేయడం గమనార్హం.

More articles

Latest article