అకౌంట్స్ గెజిటెడ్ సర్వీసెస్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక

0 1,522

బతుకమ్మ నిజామాబాద్ సిటీ : తెలంగాణ ట్రెజరిస్, అకౌంట్స్ గెజిటెడ్ సర్వీసెస్ అసోసియేషన్ సాధారణ సర్వసభ్య సమావేశం సోమవారం నూతన కలెక్టరేట్ లోని ట్రెజరీ హాల్ లో నిర్వహించారు. ఈ సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ సమావేశాన్ని అధ్యక్షులు రాములు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమావేశంలో ట్రెజరి డిపార్ట్ మెంట్ సమస్యల గురించి చర్చించారు. ఈ కార్యక్రమానికి తెలంగాగా ట్రెజరీ అకౌంట్స్ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు గందల పురుషోత్తం రెడ్డి, ప్రధాన కార్యదర్శి పరుశురాం, ఇతర కార్యవర్గ సభ్యులు సాయి రెడ్డి, శ్రీనివాస్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి జగదీశ్వర్, టీటీఎన్ జీవోఏ అధ్యక్ష, కార్యదర్శలు మారుతి, కార్తీక్, ఆదిలాబాద్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కట్ట శ్రీవాస్ లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ట్రెజరరీ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు.

Leave A Reply

Your email address will not be published.