ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకోవాలి

0 18,565
  • మాజీ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి

 

ఆర్మూర్,బతుకమ్మ: ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభు త్వంతో పాటు ప్రజలపై కూడా ఉందని పౌర స్పందన వేదిక రాష్ట్ర అధ్యక్షుడు, ఉపాధ్యాయ మాజీ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సి రెడ్డి అన్నారు. విద్య, వైద్య రంగాల ను కాపాడుకోవాలనే లక్ష్యంతో పౌర స్పందన వేదిక ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న ప్రచార జాతా శుక్రవారం  నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ చేరుకున్న సందర్భంగా మామిడి పల్లి చౌరస్తా లో ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ప్రైవేట్ పాఠశాలలకు విచ్చలవిడిగా అనుమతులు ఇవ్వడంతో ప్రభుత్వ విద్యారం గానికి తీవ్రనష్టం వాటిల్లుతోందని అన్నారు. ప్రైవేట్ పాఠశాలల ఫీజులు భరించలేని నిరుపేద తల్లిదండ్రులు మరింత పేదరికంలోకి జారి పోతు న్నారన్నారు. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ప్రీ ప్రైమరీ తరగతులు ఏర్పాటు చేయాలి తరగతికొక గది తరగతికొక ఉపాధ్యాయుడు అదేవిధంగా ప్రధానోపాధ్యాయులు ఉండే విధంగా ఏర్పాటు చేయాలన్నారు కేంద్ర ప్రభుత్వము కేంద్ర బడ్జెట్లో విద్యకు 10% కేటాయించాలని తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ప్రీ ప్రైమరీ తరగతుల ఏర్పాటుకు కేంద్రం 5000 కోట్లు ప్రత్యేక గ్రాండ్ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పౌర స్పందన వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.రాదేశాం, టిఎస్ యూటీఎఫ్ రాష్ట్రకార్యదర్శి  డి.సత్యానంద్ జిల్లా అధ్యక్షులు ఓ.రమేష్ జిల్లా ఉపాధ్యక్షులు మల్లేష్ నాయకులు పద్మావతి, లక్మన్ రాజేశ్వర్ భూమేష్ చంద్రశేఖర్, బావాయి, ప్రవీణ్ ,రాజనర్సయ్యా తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.