ఎన్ఏంసీఏంఎస్ కు శ్రీనిధి ఎంపిక

0 15,506

వేల్పూర్, బతుకమ్మ : గవర్నమెంట్ హై స్కూల్స్ లో చదివే ప్రతిభ,పేద విద్యార్థులకు ఆర్థికంగా ఆసరా అందించేందుకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్ షిప్ కు జవ్వాజి శ్రీనిధి అర్హత సాధించింది. మండలంలోని జడ్పిహెచ్ఎస్ రామన్నపేట్ లో 8వ తరగతి చదువుతున్న శ్రీనిధి ఎన్ ఎం సీ.ఎం. స్కాలర్ షిప్ కోసం నిర్వహించిన ఎలజిబిలిటీ టెస్ట్ వ్రాసి ఎంపిక అయ్యింది. ఈ స్కాలర్ షిప్ కు ఎంపికైన విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం 9వ, 10వ తరగతులతో పాటు ఇంటర్ మీడియట్ రెండు సంవత్సరాలు నెలకు రూ. 1000 అందిస్తుందని స్కూల్ హెడ్ మాస్టర్ శివాజీ తెలిపారు. నాలుగేండ్ల పాటు ఈ స్కాలర్ షిప్ తో విద్యార్థులు చదువుకోవచ్చునని తెలిపారు. ప్రతి యేడు స్కూల్ నుండి ఈ ఎన్ ఎం సీ ఎం ఎస్ వ్రాత పరీక్షను ఆసక్తి ఉన్న విద్యార్థులతో రాపిస్తున్నామని హెచ్. ఎం వెల్లడించారు. ఈ వ్రాత పరీక్షలోప్రతిభ కనబర్చి స్కాలర్ షిప్ కు ఎంపికై జవ్వాజి శ్రీధర్, మనోరంజని దంపతులకు కుమార్తే శ్రీనిధిని స్కూల్ స్టాఫ్, గ్రామ ప్రజలు అభినందించారు.

Leave A Reply

Your email address will not be published.