- ప్రధాని లాంటి వ్యక్తే మెజిస్ట్రేట్ ఎదుట హాజరయ్యాడు
- పార్టీలో ఉన్న దెయ్యాలు ఎవరో చెప్పాలి
- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
హైదరాబాద్, బతుకమ్మ : తప్పు చేసినందుకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరు కావాల్సిందేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఆలేరులో శుక్రవారం జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. తప్పు చేసినందుకు విచారణ కమిషన్ నోటీసులు ఇచ్చిందని, ప్రధాని లాంటి వ్యక్తే మెజిస్ట్రేట్ ఎదుట హాజరయ్యాడని తెలిపారు. పార్టీలో ఉన్న దెయ్యాలు ఎవరో చెప్పాలని, పార్టీలో దెయ్యాలు చేరాయని సొంత ఇంటి బిడ్డ అంటే సప్పుడు లేదని అన్నారు. టీఆర్ఎస్ కాదని దెయ్యాల రాజ్య సమితి అని అన్నారు. కొరివి దెయ్యాలను తరిమికొట్టాలని పిలుపు నిచ్చారు. చేసిన పాపలు ఊరికే పోవు, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినపుడు నడుం విరిగి పడ్డారని తెలిపారు. గత పాలకులు ప్రజలను రెచ్చగొట్టి ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నాయన్నారు. యాదాద్రి ఇక నుండి యాదగిరిగుట్టగా మార్పు చేస్తున్నామని తెలిపారు. టీటీడీ తరహాలో వైటీడీనీ త్వరలో ఏర్పాటు చేస్తామన్నారు. ఎవరూ అడ్డుపడిన మూసి నది ప్రక్షాళన చేస్తామన్నారు. ఆ ఇంటి బిడ్డనే చుట్టూ దయ్యాలు ఉన్నాయని బయటపెట్టినా… ఆ దయ్యాల నాయకుడు సమాధానం చెప్పడం లేదని విమర్శించారు. అది బీఆర్ఎస్ కాదు డీఆరెస్.. భారత రాష్ట్ర సమితి కాదు… దెయ్యాల రాష్ట్ర సమితి అని ఎద్దేవా చేశారు. ఈ కొరివి దెయ్యాలను తెలంగాణ పొలిమేరల వరకు తరిమికొట్టాలలని పిలుపునిచ్చారు. ఒక్క నోటీసు ఇస్తేనే ఆయన ఆగమాగం అయితుండు… జవాబు చెప్పాల్సింది పోయి విమర్శలు చేస్తుండు అని అన్నారు. ముందు నీ బిడ్డ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పు అని సూచించారు.