. . . గుమ్మడి ఫౌండేషన్ కు 20 వేల చెక్ అందజేత
కోటగిరి, బతుకమ్మ:
ఎన్పీడీసీఎల్ ఉద్యోగస్తులు ప్రతి నెల టీజీ ఎన్పీడీసీఎల్ చారిటబుల్ ట్రస్ట్ వారి జీతాల నుంచి కాంట్రిబ్యూషన్ చేస్తూ గత సంవత్సరం నుంచి నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఆర్థిక చేయూత ప్రతినెల 20 వేల చొప్పున ఒక సంస్థకు సంవత్సర కాలం గా అందజేస్తుంది . సీఎం డి కర్నాటి వరుణ్ రెడ్డి ఆధ్వర్యంలో ఎన్పీడీసీఎల్ కంపెనీ ఈ సంవత్సరం 11 సంస్థలకు ఇవ్వడానికి నిర్ణయించింది. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం లో ఎక్లాస్పూర్ క్లాస్ ప్రోగ్రాం లో గుమ్మడి ఫౌండేషన్ ఎన్జీవో కు సంవత్సర కాలం పాటు ప్రతి నెల రూ.20 వేల చెక్కు ద్వారా మంగళవారం నిజాంబాద్ జిల్లా ఎస్ ఈ పి వి రాజేశ్వరరావు ఆధ్వర్యంలో చెక్కును ఫౌండేషన్ ప్రతినిధికి అందజేశారు. గుమ్మడి ఫౌండేషన్ అనాధ బాలలకు చేయూతను అందజేస్తున్నందుకు వారిని అభినందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో డి ఈ ఆపరేషన్( బోధన్) ఎండి ముక్తార్, డి ఈ (టెక్నికల్) వెంకటరమణ, తోట రాజశేఖర్ (ఏ డి ఈ) ,వివిధ సంఘాల ప్రతినిధులు రాజేందర్ గౌడ్, వేణుగోపాల్, గంగారాం నాయక్, సురేష్ కుమార్ స్థానిక ఏ ఈ బుజ్జి బాబు, గుమ్మడి ఫౌండేషన్ బాల ప్రసాద్ సిబ్బంది పాల్గొన్నారు.
