… కోళ్ల ఫారం లో సీసీ కెమెరాలో చిరుత దృశ్యాలు
ఇందల్వాయి,బతుకమ్మ :
ఇందల్వాయి మండలం లో చిరుత సంచారం కలకలం రేపింది. ఇందల్వాయి మండలం ఎల్లారెడ్డి పల్లి శివారులో శ్రవణ్ అనే రైతుకు సంబంధించిన వ్యవసాయ క్షేత్రం వద్ద చిరుత పులి తిరిగిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. మంగళవారం రాత్రి ఎల్లారెడ్డి పల్లి ఆటవీ ప్రాంతం నుంచి చిరుత స్థానికంగా ఉన్న శివారు ప్రాంతాలకు వచ్చి ఉంటుందని ఇందల్వాయి ఎప్ఆర్ఓ రవి మోహన్ భట్ తెలిపారు.చిరుత కోళ్ల ఫారం వద్ద సంచారించడంతో కుక్కలు అరుపులతో అక్కడినుండి చిరుత వెనుదిరిగిన ట్లు సమాచారం. చిరుత కనిపించిన సీసీ కెమోరాలు అనుసరించి అక్కడ బుధవారం ఉదయం పాద ముద్రలు సేకరించినట్లు ఎప్ఆర్ఓ తెలిపారు. చిరుత సంచారం పట్ల గ్రామ ప్రజలు, ఆటవి శివారు ప్రాంతాల గ్రామాల రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా కోరారు.
