బొప్పాపూర్ లో వీడని మహిళ హత్య కేసు మిస్టరీ

0 14,276
  • నిందితున్ని అరెస్ట్ చేసిన పోలీసులు
  • న్యాయం జరిగేనా..?

 

రుద్రూర్, బతుకమ్మ : రుద్రూర్ మండలం బొప్పాపూర్ గ్రామంలో శనివారం రాత్రి మహిళా అనుమానాస్పద స్థితిలో మరణించిన విషయం విధితమే. అదే రోజు రాత్రి గ్రామంలో  పట్ల సాయిలు, సంగోల్ల వినోద్, నారోజి శ్రీకాంత్  తండ్రి పేరు నారోజు లచ్చయ్య  అను వారి యొక్క గడ్డివాములు కాల్చివేసిన అదే గ్రామానికి చెందిన నందిగాం ప్రవీణ్ అను వ్యక్తిపై రుద్రూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా, రుద్రూర్ ఎస్సై పి. సాయన్న కేసు నమోదు చేశారు. సోమవారం ప్రవీణ్ ను పట్టుకొని మూడు కేసులలో అరెస్టు చేసి రీమాండ్ నిమిత్తం బోధన్ కోర్టుకు పంపించారు. కాగా  ప్రవీణ్ శనివారం రోజున రాత్రి మద్యం మత్తులో తన తల్లిని హత్య చేసి పరారయినట్లు గ్రామస్తులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం రోజున రుద్రూర్ ఎస్సై పి.సాయన్న బొప్పాపూర్ గ్రామానికి వెళ్లి అంత్యక్రియలను అడ్డుకున్న  విషయం తెలిసిందే. ఈ విషయం సీపి సాయి చైతన్య దృష్టికి వెళ్లిందని, అయినా కూడా పోలీసులకు వినకుండా గ్రామస్తులు బలవంతంగా మహిళా అంతక్రియలు నిర్వహించారని పలువురు ఆరోపిస్తున్నారు. ఈ హత్య కేసు విషయంపై  పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని పలు ఆరోపణలు వెలువేత్తుతున్నాయి. ఈ విషయంలో మహిళా హత్య పై న్యాయం జరిగేనా అని వేచి చూడాల్సి ఉంది.

Leave A Reply

Your email address will not be published.