. . . ఇరిగేషన్ అధికారులతో పలు అంశాలపై చర్చ
నిజామాబాద్ రూరల్, బతుకమ్మ :
నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ పరిధిలోని ధర్పల్లి మండలం హొన్నాజీ పేట్ ముత్యాల చెరువు మరమ్మతులు, చెక్ డ్యామ్ లు, తదితర అంశాల పై ఇరిగేషన్ అధికారులు ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డిని కలిశారు. మంగళవారం ఎమ్మెల్యే ను వారి నివాసంలో కలిసి పలు అంశాల పై చర్చించారు. ముత్యాల చెరువు గత 2025 వర్షాకాలంలో దెబ్బతినగా ఆ ప్రభావం మండలంలోని వాడి, హొన్నాజిపేట గ్రామ రైతుల పైన పడింది. దీంతో మరమ్మత్తులు చేపట్టాలని గ్రామస్థులు విన్నవించారు. ఈ మేరకు మరమ్మతుల పనులకు సంబంధించిన ప్రణాళికను మ్యాప్ పాయింట్ ద్వారా ఎమ్మెల్యేకు అధికారులు వివరించారు. అదే విధంగా చెరువు రక్షణార్థం ప్రొటెక్షన్ వాల్ నిర్మాణం తో పాటు నియోజకవర్గంలోని చెక్ డ్యామ్ ల అంశంపై చర్చించారు. సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే నిధుల విడుదల తదితర అంశాలను గురించి రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి తగు చర్యల నిమిత్తం లేఖ రాశారు. నియోజకవర్గంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వర్షాకాలం కంటే మునుపే పనులు పూర్తయ్యేలా అధికారులు సమిష్టి కృషితో పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ ఎస్ఈ నజీర్ హుస్సేన్, ఈఈ నరేంద్ర కుమార్, డిఈ ప్రేమ్ కుమార్, ఏఈలు సాయినాథ్, రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
