నిజామాబాద్ సిటి, బతుకమ్మ:
వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మెడికవర్ హాస్పిటల్ నిజామాబాద్ ఆధ్వర్యంలో 3 కే వాక్‌థాన్ నిర్వహించారు. మంగళవారం ఉదయం నగరంలోని కంఠేశ్వర్ బైపాస్ చౌరస్తా నుంచి ఎల్లమ్మ గుట్ట లో మెడికవర్ హాస్పిటల్స్ వరకు ఈ వాక్‌థాన్ కొనసాగింది. వాక్ థాన్ ను మెడికవర్ హాస్పిటల్ కార్డియాలజిస్ట్ డా. సందీప్ రావు జెండా ఊపి ప్రారంభించారు.ఈ సందర్భంగా డా. సందీప్ రావు మాట్లాడుతూ గుండె ఆరోగ్యంపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని, ప్రతిరోజూ నడక, వ్యాయామం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం ద్వారా గుండెను ఆరోగ్యంగా కాపాడుకోవచ్చని తెలిపారు.కార్డియాలజిస్ట్ డా. జగదీష్ చంద్ర బోస్ మాట్లాడుతూ గుండె సంబంధిత సమస్యలు నిర్లక్ష్యం చేయకుండా ముందస్తుగా వైద్యులను సంప్రదించాలని, క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.కార్డియో థొరాసిక్ సర్జన్ డా. రాకేష్ మాట్లాడుతూ గుండె జబ్బుల పై ప్రజల్లో అవగాహన పెంచడం ఎంతో అవసరమని తెలిపారు.సెంటర్ హెడ్ కె. స్వామి మాట్లాడుతూ ప్రజల్లో గుండె ఆరోగ్యంపై అవగాహన కల్పించడమే ఈ వాక్‌థాన్ ముఖ్య ఉద్దేశమని తెలిపారు. మెడికవర్ హాస్పిటల్స్‌లో అన్ని ఆధునిక వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు.కార్డియాలజిస్టులు డా.రవికిరణ్, డా.వరీస్ అలీ, సతీష్ యూరాలజిస్ట్ తో పాటు ఇతర వైద్యులు, మెడికవర్ హాస్పిటల్స్ సిబ్బంది కార్యక్రమంలో పాల్గొన్నారు

