22.7 C
Hyderabad

మంద కృష్ణ మాదిగను కలిసిన తాళ్ళరాంపూర్ వీడీసీ బాధితులు . . .

Victims of the Thallaramapur VDC met Manda Krishna Madiga

Must read

📰 Generate e-Paper Clip

. . . విడిసీల రద్దు కోసం ఎమ్మార్పీఎస్ అండగా ఉంటుంది అని హామీ  

నిజామాబాద్, బతుకమ్మ:

వీడీసీ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో  ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు పద్మశ్రీ మంద కృష్ణ తాళ్ల రాంపూర్” గ్రామ అభివృద్ధి కమిటీ” బాధితులు కలిసారు. సోమవారం హైదరాబాద్ లో మంద కృష్ణ ను కలిసిన విడిసీబాధితులు తమ గోడును వెల్లబోసుకున్నారు. ఈ సందర్భంగా మంద కృష్ణ  మాట్లాడుతూ అన్ని ప్రజాస్వామిక సంఘాల ద్వారాఇట్టి సమస్య పరిష్కార దిశగా మీకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ కాలంలో కూడా ఇలాంటి సాంఘిక బహిష్కరణ వంటి దురాగతాలుజరగడం సిగ్గుచేటు అని అన్నారు. వారి ఆధిపత్య కుల అహంకార ధోరణి కూకటివేళ్లతోఅని చేస్తాం.. బాధితులకు అండగా ఉంటాం అని భరోసా ఇచ్చారు.  ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు సరికేల పోశెట్టి మాదిగ మాట్లాడుతూ త్వరలో వీడీసీ వ్యతిరేక పోరాట సమితి తోఉద్యమం చేస్తాం అన్నారు. నిజామాబాద్ జిల్లా నుండి అధికార పార్టీ నుండి పీసీసీ అధ్యక్షుడు హోదాలో మహేష్కుమార్ గౌడ్ వుండి తన సామాజిక వర్గం వారిని ,దళితుల సాంఘిక బహిష్కరణ చేయడంసిగ్గుచేటు  అన్నారు.  పీసీసీ చీఫ్ హోదాలో నిజామాబాద్ లో ఉండిపరామర్శించకపోవడం మరి వారిపై చట్టరీత్యా చర్య తీసుకోకపోవడం సిగ్గుచేటు అన్నారు. ఈకార్యక్రమంలో  బట్టు శ్రీధర్, బాదితులు దిబ్బ సుదర్శన్ , నర్సా గౌడ్ , నారాయణ గౌడ్ , గంగాధర్ , దేవదాస్ , దేవన్న , జనార్దన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article