వెబ్ డెస్క్, బతుకమ్మ :
ఖమ్మం పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇన్స్ పెక్టర్ స్థాయి అధికారులకు ఐజీ చంద్రశేఖర్ రెడ్డి స్థానచలనం కలిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసారు.నలుగురికి నో పోస్టింగ్..ఐజీ ఆఫీస్‌కు అటాచ్ చేస్తూ మల్టీ జోన్-1 ఐజీ సంతోష్ చంద్రశేఖర్ రెడ్డి ఉత్తర్వులు ఖమ్మం జిల్లాలో చర్చనీయాంశంగా మారాయి. కీలక స్థానాల్లో ఉన్న నలుగురు సీఐలకు వెంటనే కొత్త స్థానాలు కేటాయించలేదు. వీరందరినీ నేరుగా హైదరాబాద్‌లోని ఐజీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని బొమ్మెర బాలకృష్ణ, రాదం భానుప్రకాష్, బెల్లం సత్యనారాయణ, జిల్లేళ్లమూడి మోహన్‌బాబులకు ఆదేశాలు వెలువడ్డాయి.ఇంటెలిజెన్స్ విభాగం నుంచి ఖమ్మం Iవ టౌన్ ఎస్‌హెచ్‌ఓగా నియామకం,సీఎస్‌బీ నుంచి ఖమ్మం 2వటౌన్ ఎస్‌హెచ్‌ఓగా పోస్టింగ్..ముగ్గురు సీఐలకు పోస్టింగ్ ఇవ్వకుండా నేరుగా ఐజీ ఆఫీస్‌కు పిలవడంపై హాట్ టాపిక్ గా మారింది.


