27.6 C
Hyderabad
Sunday, August 2, 2026

ఇంటి స్థలాలు ఇప్పించాలని ఎమ్మెల్యేకు వినతి

Must read

📰 Generate e-Paper Clip

ఇందల్వాయి, బతుకమ్మ : ఇందల్వాయి మండల కేంద్రానికి చెందిన వర్కింగ్ జర్నలిస్టులు ఆదివారం ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి క్యాంపు కార్యాలయంలో కలిసి తమకు ఇంటి స్థలాలు కేటాయించాలని కోరారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నుండి ఇందల్వాయి మండలం కొత్తగా కావడంతో గత పది సంవత్సరాలుగా జర్నలిస్టులుగా పనిచేస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వం పదేళ్లలో జర్నలిస్టులకు ఇంటి స్థలాలు ఇస్తామాని చెప్పి ఇప్పటివరకు ఇవ్వలేదని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి మాట్లాడుతూ రెండో విడత లో తప్పనిసరిగా ఇంటి స్థలాలు ఇప్పిస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఇందల్వాయి మండల వర్కింగ్ జర్నలిస్ట్ అధ్యక్షులు నీరడీ గంగాధర్, ఉపాధ్యక్షులు శ్రీపతి జితేందర్, సంయుక్త కార్యదర్శి పాశం నరసయ్య, ఉపాధ్యక్షులు,రాకేష్, జెగ్గ రాములు, మెండే అశోక్, పాల్గొన్నారు.

More articles

Latest article