నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నిజామాబాద్ నగర శివారులోని ఆరో టౌన్ పరిధిలో గల శాస్త్రీ నగర్ లో ఒక ఇంటిపై పోలీసులు దాడి నిర్వహించారు. ఆదివారం రాత్రి నిజామాబాద్ ఆరో టౌన్ పోలీసులు దాడి నిర్వహించి 8మందిని అదుపులోకి తీసుకుని రూ.30వేలు స్వాధీనం చేసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసినట్లు నిజామాబాద్ సౌత్ రూరల్ సీఐ సురేష్ కుమార్ తెలిపారు. ఈ నెలలోనే శాస్త్రీనగర్ లోని పేకాట స్థావరంపై జరిగిన దాడిలో పట్టుబడిన ముగ్గురు ఆదివారం మరోసారి పట్టుబడటం విశేషం. పేకాట నిర్వాహకులే తప్పించుకుని ఆడుతున్న వారిపై కేసులు నమోదు చేయించారని విమర్శలు ఉన్నాయి.
