27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

కందర్ పల్లి వద్ద రోడ్డు ప్రమాదం

Must read

📰 Generate e-Paper Clip

బిచ్కుంద, బతుకమ్మ : బిచ్కుంద మండలం కందర్ పల్లి వద్ద రోడ్డు ప్రమాదంలో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. జుక్కల్ మండలం పడంపల్లి గ్రామానికి చెందిన బాల్ రాజ్ (30) కందర్ పల్లి సమీపంలో మూలమలుపు వద్ద రాంగ్ రూట్ లో వస్తూ ప్రమాదానికి గురైనట్లు స్థానికులు తెలిపారు. తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉందని స్థానికులు  తెలిపారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ప్రమాదంపై ఆరా తీస్తున్నారు.

More articles

Latest article