25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

మంచిప్ప 21ప్యాకేజీ పనులు పూర్తిచేసి నీళ్లు అందించాలి

Must read

📰 Generate e-Paper Clip

  • అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షులు వేల్పూర్ భూమయ్య           

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : మంచిప్ప 21 ప్యాకేజీ పనులు పూర్తిచేసి నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం లోని 84 వేల ఎకరాలకు నీళ్లు అందించాలని అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షులు వేల్పూర్ భూమయ్య డిమాండ్ చేశారు. నగరంలోని ఎన్ఆర్ భవన్ కోటగల్లి నిజామాబాద్ ప్రెస్ మీట్ లో వేల్పూర్ భూమయ్య మాట్లాడుతూ.. గత బిఆర్ఎస్ ప్రభుత్వం 2018 సంవత్సరంలో నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం సెగ్మెంట్ కు నీళ్లు ఇచ్చేందుకుగాను మోపాల్ మండలంలోని మంచిప్ప ప్రాజెక్టు నీటిని 2623 వేల కోట్ల రూపాయల  అంచనా  వ్యయంతో నిర్మించ  తలపెట్టిన 21 ప్యాకేజ్ పనులు సకాలంలో పూర్తి కాలేదని అన్నారు. 2022లో వ్యయంను రీవైజ్ చేస్తూ 3650 కోట్లు కు పెంచిన ప్రభుత్వం వాటికి నిధులు కేటాయించలేదని అన్నారు. ఈ మొత్తం పనులు పూర్తి కావడానికి మరొ 2000  వేల కోట్లు రూపాయలు విడుదల చేయాలని డిమాండు చేశారు. ఈ ప్రాజెక్టు పరిధిలో 6 మండలాలలోని 77 గ్రామాలు, వాటి అనుబంధ తండాలకు 84 వేల ఎకరాలకు  నీళ్లందుతాయని తెలిపారు. దీనితోపాటు ఈ ప్రాంత చెరువులు, కుంటలు నింపవచ్చునని,ఈ పనులు 50%వరకే పూర్తయినాయిని. మిగతా పనులను టిఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి చేయలేదని అన్నారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన, రైతు రాజ్యం, రైతు నేస్తం అంటూ మాటలు మాట్లాడుతుంది కానీ చేతలలో చూపించడం లేదని, మధ్యలో అర్థంతరంగా ఆగిపోయిన 21 ప్యాకేజీ పనులకు తగిన నిధులు కేటాయించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని అన్నారు. వెంటనే 2000 కోట్లు కేటాయించి పనులను పూర్తి చేయాలని అఖిలభారత రైతు కూలీ సంఘం (ఏఐకేఎంఎస్) కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుందని అన్నారు. రైతులు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఈ 21 ప్యాకేజీ పనులను పూర్తి చేయడానికి గాను ప్రభుత్వం వెంటనే రెండు వేల కోట్ల రూపాయల నిధులు విడుదల చేయాలి. ప్రాజెక్టు ఎత్తు పెంచకుండా ప్రభుత్వం జీవో విడుదల చేసి పనులు ప్రారంభించాలని ఏఐకేఎంఎస్ ప్రభుత్వన్నీ డిమాండ్ చేస్తుందిని అన్నారు. ఈ ప్రెస్ మీట్ లో దేశెట్టి సాయరెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి, గాదేపాక నతన్, సుధాకర్,  రాములు, సాయిలు, గంగాధర్,గోపాల్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article