24 C
Hyderabad
Sunday, August 2, 2026

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఒకరికి జైలు శిక్ష

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడిన ఒకరికి న్యాయస్థానం జైలు శిక్ష విధించినట్లు నగరంలోని ఐదో టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై ఎం గంగాధర్ తెలిపారు. సోమవారం డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించగా.. నాగారం ప్రాంతానికి చెందిన ఉల్లెంగ సాయిలు మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడ్డాడు. అతడిని సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ ఎదుట మంగళవారం హాజరుపర్చగా న్యాయమూర్తి రెండు రోజుల జైలు శిక్ష విధించారు. మద్యం సేవించి వాహనాలు నడిపిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్సై గంగాధర్ స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ నిబంధనలను పాటించాలని ఆయన సూచించారు.

More articles

Latest article