27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

ముంబై ఇండియన్స్ లోకి ముగ్గురు మొనగాళ్లు

Must read

📰 Generate e-Paper Clip

ముంబై, బతుకమ్మ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో తలపడుతున్న ముంబై ఇండియన్స్ ముగ్గురు కీలక ఆటగాళ్లను జట్టులోకి తీసుకురావాలని నిర్ణయం తీసుకుంది. భారత్ – పాక్ యుద్ధం నేపథ్యంలో కొద్దిరోజులపాటు ఐపీఎల్ నిలిచిపోయిన విషయం తెలిసిందే.

ఆ తరువాత కార్బిన్ బాష్, విల్ జాక్స్, ర్యాన్ రికెల్టన్ ఇండియాకు తిరిగి రాలేదు. ఆ ముగ్గురి స్థానంలో శ్రీలంక ఆటగాడు చరిత్ అసలంక, ఇంగ్లాండ్ ప్లేయర్లు జానీ బెయిర్ స్టో, రిచర్డ్ గ్లీస న్ ను తీసుకోవాలని ముంబై ఇండియన్స్ యాజమాన్యం నిర్ణయించింది.

గతేడాది బెయిర్ స్టో ను ఫ్రాంచైజీలు ఏవీ కొనుగోలు చేయలేదు. ప్రస్తుతం ముంబై ఇండియన్స్ యాజమాన్యం అతడిని రూ.5.25 కోట్లు ఇచ్చి తీసుకుంది. అలాగే గ్లీస్ న్ కు రూ.కోటి, అసలంకకు రూ.75 లక్షలు ఇచ్చింది.

More articles

Latest article