. . . సంతోష్ గౌడ్ ను రిమాండ్ కు తరలించిన పోలిసులు
. . . మరొకరిని విచారిస్తున్నట్లు సమాచారం
మాక్లూర్, బతుకమ్మ :
నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలం లక్కంపల్లి గ్రామా సర్పంచ్ బొల్లపల్లి సంతోష్ గౌడ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. మాక్లూర్ మండలం మాణిక్ బండార్ శివారులో రివర్ వ్యూ అనే రియల్ వేంచర్ కు సంబంధించిన యజామాని పిర్యాదు మేరకు సంతోష్ గౌడ్, రంజీత్ రావు అనే వ్యక్తులపై ఇటివల మాక్లూర్ పిఎస్ లో కేసు నమోదు చేసినట్లు నార్త్ రూరల్ సిఐ శ్రీనివాస్ తెలిపారు. రియల్ వెంచర్ ప్రాజెక్ట్ కు సంబంధించి దాదాపు రూ.9 కోట్ల వరకు లెక్కలు తారు మారు నేపథ్యంలో బాధితుడి పిర్యాదు మేరకు 318/4, 316 /5, బీఎన్ ఎస్ 61/ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి సంతోష్ గౌడ్ ను అరెస్టు చేసి రిమాండ్ కి తరలించారు. ఈ కేసులో రంజీత్ రావును విచారిస్తున్నట్టు తెలిసింది. 9 నెలల క్రితం జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో లక్షల డబ్బులు ఖర్చు చేసి మద్యం పంచి సర్పంచ్ గా గెలుపొందాడని విశ్వనీయ సమాచారం. గతంలో బీజేపీ పార్టీ లో ఉన్న సంతోష్ గౌడ్ ఇటివల అధికార పార్టీ అయినా కాంగ్రెస్ లో ఇటీవల చేరాడు అని విమర్శలు వస్తున్నాయి.
