28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

చౌట్ పల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో మోడి పుట్టినరోజు వేడుకలు

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, కమ్మర్ పల్లి :  కమ్మర్  పల్లి మండలం చౌట్ పల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో భారత ప్రధాని నరేంద్ర మోడీ  జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు గేడెం నగేష్, బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ హాజరై పాఠశాల ఆవరణలో విద్యార్థులతో కలిసి కేక్ కటింగ్ చేశారు. అనంతరం విద్యార్థులకు పండ్ల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పార్లమెంట్ సభ్యులు గేడెం నగేష్ మాట్లాడుతూ భారత ప్రధాని నరేంద్ర మోడీ దేశానికి చేస్తున్న సేవలను , కేంద్ర ప్రభుత్వం విద్యార్థులకు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించి విద్యార్థులందరూ నరేంద్రమోడీని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. అనంతరం బాల్కొండ నియోజకవర్గ విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశంలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి పోలింగ్ బూత్ లో కచ్చితంగా 200 మంది సభ్యులను భారతీయ జనతా పార్టీ సభ్యత్వం చేయించాలన్నారు. ఈ రాష్ట్రంలో సభ్యత్వ నమోదులో అన్ని జిల్లాల కంటే ముందున్న జిల్లా నిజామాబాద్ జిల్లా అన్నారు. ప్రజలు, మహిళలు, రైతులు, యువకులు దేశ పునర్నిర్మాణంలో మేము సైతం అంటూ స్వచ్ఛందంగా భారతీయ జనతా పార్టీ సభ్యత్వం తీసుకోవడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ మల్లికార్జున్ రెడ్డి, సభ్యత్వ నమోదు ప్రముఖ్ శివ రాజ్ కుమార్, అసెంబ్లీ కన్వీనర్ మల్కనగారి మోహన్, సీనియర్ నాయకులు మోహన్ రెడ్డి, కొండ ఆశన్న, జిల్లా ఉపాధ్యక్షులు నిమ్మల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article