25.2 C
Hyderabad

ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి జ్యుడిషియల్ రిమాండ్

Must read

📰 Generate e-Paper Clip

వరంగల్, బతుకమ్మ : హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి జ్యుడిషియల్ రిమాండ్ కు  తరలించాలని ఖాజీపేట రైల్వే కోర్టు ఆదేశించింది. గ్రానైట్ క్వారీ యజమాని మనోజ్ రెడ్డిని బెదిరించి, డబ్బులు అడిగిన కేసులో ఆయన్ని అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు. శంషాబాద్ ఎయిర్ పోర్టులో శనివారం తెల్లవారు జామున వరంగల్ కమిషనరేట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వరంగల్ లో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం సుబేదారి పోలీసులు ఖాజీపేట రైల్వే కోర్టులో హాజరు పరిచారు. కౌషిక్ రెడ్డికి బెయిల్ మంజూరు చేయాలని బీఆర్ఎస్  పార్టీ లీగల్ టీం దరఖాస్తు చేసింది. పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా కౌశిక్ రెడ్డి పూర్వాపరాలు వివరిస్తూ బెయిల్ మంజూరు చేయవద్దని కోర్టును అభ్యర్థించారు. ఇరువర్గాల వాదనలు విన్న మెజిస్ట్రేట్ కౌశిక్ రెడ్డికి జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. ఈ మేరకు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని ఖమ్మం జిల్లా జైలుకు తరలించేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు.

More articles

Latest article