24 C
Hyderabad
Sunday, August 2, 2026

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే వేముల

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, ఏర్గట్ల: ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏర్గట్ల గ్రామ వాస్తవ్యుడు బిఆర్ఎస్ పార్టీ నాయకుడు పిట్ల నరేష్ భార్య ఏర్గట్ల మాజీ సర్పంచ్ పిట్ల మీనా మరణించడంతో శనివారం పిట్ల నరేష్ కుటుంబాన్ని ,అలాగే మీనా తమ్ముడు మోర్తాడ్ మాజీ సర్పంచ్ ఆనంద్, అలాగే మీనా  తల్లిని,మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పరామర్శించి వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కొలిపాక ఉపేందర్ రెడ్డి, తాళ్ల రాంపూర్ సొసైటీ చైర్మన్ పెద్ద కాపుల శ్రీనివాస్ రెడ్డి, ఏర్గట్ల సొసైటీ చైర్మన్ బర్మ నరసయ్య, మాజీ ఎంపీటీసీ డాక్టర్ మధు, బద్దం ప్రభాకర్ , కొలిపాక శ్రీనివాస్ ,నేరెళ్ల నరేందర్, బిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు దేవుడు నరసయ్య,లక్కం నర్సయ్య,పౌలింగ్,పోచయ్య బిఆర్ఎస్ పార్టీ మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

More articles

Latest article