ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి జ్యుడిషియల్ రిమాండ్
వరంగల్, బతుకమ్మ : హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి జ్యుడిషియల్ రిమాండ్ కు తరలించాలని ఖాజీపేట రైల్వే కోర్టు ఆదేశించింది. గ్రానైట్ క్వారీ యజమాని మనోజ్ రెడ్డిని బెదిరించి, డబ్బులు అడిగిన కేసులో ఆయన్ని అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు. శంషాబాద్ ఎయిర్ పోర్టులో శనివారం తెల్లవారు జామున వరంగల్ కమిషనరేట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వరంగల్ లో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం సుబేదారి పోలీసులు ఖాజీపేట రైల్వే కోర్టులో హాజరు పరిచారు. కౌషిక్ రెడ్డికి బెయిల్ మంజూరు చేయాలని...