కామారెడ్డిలో అంతరాష్ట్ర కిడ్నాప్ ముఠా కుట్ర భగ్నం

0 14,246

 

. . . వ్యాపారీ కిడ్నాప్ కోసం తుపాకీ కొనుగోలు

 

. . . ఆరుగురు అరెస్ట్.. ఒకరు పరారీలో

 

కామారెడ్డి, బతుకమ్మ:

 

కామారెడ్డి జిల్లాలో వ్యాపారిని కిడ్నాప్ చేసి డబ్బులు వసూలు చేయాలని కొందరు చేసిన కుట్రలను భగ్నం చేసి ఆరుగురిని అరెస్టు చేసినట్టు, వారి దగ్గర తుపాకీని స్వాధీనం చేసుకున్నట్టు కామారెడ్డి జల్లా ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. వ్యాపారవేత్తతో లావాదేవిలు జరిపిన వారే అతడి వద్ద తీసుకున్న అప్పును ఎగ్గోట్టడమే కాకుండా అతడిని కిడ్నాప్ చేసి డబ్బులు వసూలు చేసేందుకు యత్నంను భగ్నం చేసినట్లు గురువారం కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర విలేఖరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు… ఎస్పీ కథనం ప్రకారం కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం క్రిష్ణాజీవాడ గ్రామంలో శివాలయం వద్ద ఈ నెల 27న కొందరు అనుమానిత వ్యక్తులు తాడ్వాయి పోలీసులకు తారసపడ్డారు. వారు పోలీసులను చూసి పరారీ అయ్యేందుకు యత్నించగా వెంబడించి పట్టుకున్నారు. పట్టబడిన వారిలో తాడ్వాయి మండలం చిట్యాల గ్రామానికి చెందిన నిట్టు నర్సింగరావు, సురం స్వామిలతో పాటు సంతాయి పేటకు చెందిన సూర స్వామీ అలియాస్ ఓడ్డే స్వామీ, పులి ప్రశాంత్ గౌడ్ లు ఉన్నారు. కామారెడ్డి కి చెందిన భూస శ్రీనివాస్ లో తాడ్వాయికి చెందిన నలుగురి మద్య అర్ధిక లావాదేవిలు జరిగాయి. ఈ విషయంలో నలుగురు కుడా భూస శ్రీనివాస్ కు నగదు బాకీ పడ్డారు. బాకీ ఎగ్గోట్టడంతో పాటు చాలా డబ్బులు ఉన్న భూస శ్రీనివాస్ ను కిడ్నాప్ చేయాలని నిర్ణయించారు. భూస శ్రీనివాస్ ను అపహరించడంతో పాటు బెదిరించాలంటే ఆయుధం కావాలని దాని కొనుగోలుకు ప్రయత్నం చేశారు. నలుగురు కలిసి మహారాష్ట్రకు చెందిన అజయ్, వైభవ్ లను సంప్రదించారు. మహారాష్ట్రలోని నాయగావ్ కు చెందిన మారుతి గోకే ద్వారా తుపాకి కొనుగోలు చేయాలని సంకల్పించారు. అందులో భాగంగా నర్సింగరావు, ఓడ్డే స్వామీలు ఈ నెల 12న మహారాష్ట్రకు వెల్లి అజయ్, హన్మంతరావు గొంగపాలేను వైభవ్, ప్రకాష్ బరాడేవార్ సహకారంతో మారుతి గోకేను కలిసారు. ముప్పై వేలకు ఆయుదం కొనుగోలుకు ఒప్పందం చేసుకుని ముందుగా రూ.27, 000 అడ్వాన్స్ గా ఇచ్చారు. మారుతి ఘేకో అందించిన తుపాకిని తాడ్వాయి మండలంలో క్రిష్ణాజీవాడి దగ్గర నలుగురికి మహారాష్ట్రలోని నాయగావ్ కు చెందిన వైభవ్ ప్రకాష్ బరాడేవర్, కోకులే గావ్ కు చెందిన అజయ్ హన్మంతరావు గోంగపాలేలు అందిస్తుండగా పట్టుకున్నారు. పోలీసులు ఆరుగురిని విచారించడంతో వ్యాపారీ కిడ్నాప్ కుట్ర బట్ట భయలు అయింది. దానితో ఆరుగురిని అరెస్టు చేసి వారివద్ద నుంచి ఒక నల్లరంగు పైర్ ఆర్మ్(తుపాకి), 5 రబ్బర్ బుల్లేట్ లు, ఎయిర్ రూపిల్ పెల్లెట్ బాక్సులు 2, 5 సెల్ ఫోన్ లు, ఒక బైక్. రెండు మంకీ క్యాప్ లు, 3 మాస్కులు, నైలాన్ తాడు, పసుపు రంగు టేప్, నల్లరంగు కల్లద్దాలు, రూ.3,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. అందులో నిట్టు నర్సింగరావుపై హత్యయత్నం కేసు లో నిందితుడిగా ఉన్నారు. పరారీలో ఉన్న ఆయుధం అమ్మిన మహారాష్ట్రకు చెందిన ఘోకే మారుతి కోసం ప్రత్యేక టీంలు గాలిస్తున్నాయన్నారు. ఈ కేసు చేధనలో ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాస్ చోరవతో , సదాశివ నగర్ సిఐ సంతోష్ కుమార్, తాడ్వాయి ఎస్ఐ నరేష్ లతో పాటు ఐటి కోర్ టీం, సిసిఎస్ టీంలను ఎస్పి రాజేష్ చంద్ర అభినందించారు.

 

Interstate kidnapping gang conspiracy foiled in Kamareddy

Leave A Reply

Your email address will not be published.