27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

గ్రంథాలయాలను సందర్శించిన జిల్లా గ్రంథాలయ చైర్మన్

Must read

📰 Generate e-Paper Clip

  • ముఖ్యఅతిథిగా పాల్గొన్న జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు మహమ్మద్ ఇలియాస్

బతుకమ్మ భిక్కనూరు: కామారెడ్డి నియోజకవర్గం లోని బిబీపేట్, దోమకొండ, మాచారెడ్డి, భిక్కనూరుమండల కేంద్రాల్లోని గ్రంథాలయాలను  జిల్లా గ్రంధాలయ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి సందర్శించారు.  ఈ సందర్భంగా జిల్లా గ్రంథాలయ చైర్మన్ మాట్లాడుతూ నూతన గ్రంథాలయ భవనాలను ఆధునికరించడానికి ప్రభుత్వంతో త్వరలో నిధులు మంజూరు చేయిస్తామన్నారు. ప్రతి గ్రంథాలయాల్లో అవసరమైన మేరకు స్టడీ మెటీరియల్స్ అందించే ప్రయత్నం చేస్తామన్నారు. ఈ సందర్భంగా జిల్లా యూత్ అధ్యక్షులు మొహమ్మద్ ఇలియాస్ గారు మాట్లాడుతూ తన సొంత నిధులతో కామారెడ్డి నియోజకవర్గంలోని ప్రతి గ్రంథాలయానికి ఇంటర్నెట్ కలెక్షన్ తో పాటు వైఫై ని ఏర్పాటు చేస్తామన్నారు ప్రతి గ్రంధాలయానికి తన వంతు విరాళంగా 10,000 రూపాయలచొప్పున అందిస్తామన్నారు. పోటీ పరీక్షలకు సన్నతమవుతున్న నిరుద్యోగ అభ్యర్థులకు అన్ని విధాలుగా ఉపయోగపడేలా తీర్చిదిద్దామన్నట్లు పేర్కొన్నారు. రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ రిటైర్ ఉద్యోగులు రచయితలు మేధావులు గ్రంథాలయాల అభివృద్ధికి సహకరించాలని కోరారు. రాష్ట్రంలోనే కామారెడ్డి జిల్లాలోని అన్ని గ్రంథాలను మోడల్ గ తీర్చిదిద్ది నిరుద్యోగ యువతను అవసరమయ్యే అన్ని స్టడీ మెటీరియల్స్ ప్రయత్నం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో భిక్కనూరు మండల కాంగ్రెస్ అధ్యక్షులు భీమ్ రెడ్డి కార్యకర్తలు పాల్గొన్నారు.

More articles

Latest article