బతుకమ్మ, బిచ్కుంద : జుక్కల్ నియోజకవర్గం లో మహిళా సంఘాలకు రూ. రెండు కోట్ల 76 లక్షల వడ్డీలేని రుణాలు ప్రభుత్వం అందజేస్తుందని జెడ్పి సీఈవో చందర్ నాయక్ తెలిపారు. మంగళవారం బిచ్కుంద మండల కేంద్రంలోని అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ లో జరిగిన మహిళా స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాల పంపిణీ కార్యక్రమానికి ఏపీఎం రవీందర్ తో కలిసి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జుక్కల్ నియోజకవర్గానికి సంబంధించి రూ.2కోట్లు 76 లక్షల రూపాయల చెక్కును అందజేశారు. ఈసందర్భంగా చందర్ నాయక్ మాట్లాడారు. రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయాలనే రాష్ట్ర ప్రభుత్వ సంకల్పానికి నిదర్శనంగా మరోసారి రాష్ట్రంలోని స్వయం సహాయక మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలను ప్రభుత్వం అందించనున్నది. ఇందుకు మంగళవారం ఒకేరోజు నియోజకవర్గ వ్యాప్తంగా వడ్డీ లేని రుణాలను మూడో విడత అందించేందుకు శ్రీకారం చుట్టింది. అని ఆయన అన్నారు. అనంతరం పిసిసి డెలిగే ట్ సభ్యులు విట్టల్ రెడ్డి మాట్లాడుతూప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండుసార్లు వడ్డీ లేని రుణాలను ఇచ్చిన విషయం తెలిసిందే. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే.. మహిళలను కోటీశ్వరులుగా చేస్తామని, వారి కాళ్ళ మీద వారిని నిలబడేలా తీర్చిదిద్ది కుటుంబాలను అభివృద్ధి చేసేందుకు, తద్వారా మహిళలు ఆర్థికంగా ఎదిగి స్వయం సమృద్ధి సాధించేందుకు చర్యలు తీసుకుంటామన్న ప్రజా ప్రభుత్వ హామీ మేరకు మహిళలకు అన్ని రంగాలలో అవకాశాలు కల్పిస్తున్నది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించింది. అని అన్నారు. ఏపిఎం రవీందర్ మాట్లాడుతూ మహిళా సంఘాలకు పాఠశాల విద్యార్థుల యూనిఫామ్స్ కుట్టే పనిని, అమ్మ ఆదర్శ పాఠశాల పనులను అప్పగించింది. బ్యాంకు లింకేజీ ద్వారా రుణాలను కల్పించడం, ఇటీవల కాలంలో పెట్రోల్ బంకుల నిర్వహణను కూడా మహిళలకు అప్పగించింది. అంతేకాక ప్రతి జిల్లా కేంద్రంలో ఎంపిక చేసిన ప్రాంతాలలో మహిళా శక్తి క్యాంటీన్లను ఏర్పాటు చేయడమే కాకుండా, వికలాంగులు, జెండర్ సమస్యల కోసం సామాజిక కార్యక్రమాల నిర్వహణను, గ్రామ సంఘాలకు, మండల సమాఖ్యలకు భవనాల నిర్మాణం వంటి అభివృద్ధి కార్యక్రమాలను ప్రభుత్వం కల్పిస్తున్నది.ఇందులో భాగంగానే ప్రతి సంవత్సరం మహిళలకు వడ్డీ లేని రుణాలను పెద్ద మొత్తంలో ఇస్తున్నారాని అన్నారు. ఈ కార్యక్రమంలో డిపిఎం సాయిలు, ఎంపీడీవో గోపాలకృష్ణ, మున్సిపల్ కమిషనర్ హయ్యుం నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు, ఐకెపి సీసీలు మహిళా సంఘాల అధ్యక్షులు సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
