30.2 C
Hyderabad

డ్రంక్ అండ్ డ్రైవ్ లో ఇద్దరికి ఏడు రోజుల జైలు శిక్ష

Must read

📰 Generate e-Paper Clip

ఇందల్వాయి, బతుకమ్మ : ఇందల్వాయి మండల కేంద్రంలో గత రెండు రోజుల క్రితం ఇందల్వాయి  పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన ఎస్ఎస్ నగర్ మండలంలోని ఆమర్ల బండ గ్రామానికి చెందిన ముజ్జోడ దత్తురావు, కామారెడ్డి మండలంలోని ఆరెపల్లి  గ్రామానికి చెందిన ఎర్రగుళ్ల మల్లేష్ అనే ఇద్దరు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలలో పట్టుబడ్డారు. వీరిని మంగళవారం కోర్టులో హాజరుపరచగా స్పెషల్ జ్యుడీషియల్ సెకండ్ క్లాస్  మెజిస్ట్రేట్ స్పెషల్ ఎక్సైజ్ కోర్టు  అహ్మద్, నిజామాబాద్ న్యాయమూర్తి ఇద్దరికీ 7 రోజులు జైలు శిక్ష విధించడం జరిగిందని ఎస్సై జి సందీప్ తెలిపారు. తాగి వాహనాన్ని నడపడం చట్టరీత్యా నేరం,తాగి వాహనాలు గడప వద్దని సూచించారు. ద్విచక్ర వాహనాల పైన వెళ్లేటప్పుడు హెల్మెట్లు తప్పనిసరిగా ధరించాలని ప్రయాణికులకు స్థానిక ఎస్సై జి సందీప్ సూచించారు.

More articles

Latest article