24 C
Hyderabad
Sunday, August 2, 2026

విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి

Must read

📰 Generate e-Paper Clip

మోర్తాడ్, బతుకమ్మ: ప్రతి విద్యార్థి సుకన్య సమృద్ధి యోజన పథకంను, జీరో అకౌంట్ ను సద్వినియోగం చేసుకోవాలని ఏస్ బీ ఐ బ్యాంక్ మేనేజర్ శ్రీ రేఖ అన్నారు. మోర్తాడ్ మండలంలోని పాలెం గ్రామంలో గల ప్రాథమికోన్నత పాఠశాలలో మంగళవారం ఫైనాన్షియల్ లిటరసీ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డబ్బులు ఏవిధంగా పొదుపు చేయాలి. ఇలా వినియోగించుకోవాలో విద్యార్థులకు అవగాహన కల్పించారు. అనంతరం బ్యాంక్ అధికారులను ఉపాధ్యాయ బృందం శాలువాలతో సన్మానించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు ప్రమీల, ఏస్ బీ ఐ అధికారి భాషా, ఉపాధ్యాయ బృందం విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article