జై జవాన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయురాలికి గౌరవ వేతనం అందజేత

0 9,875

 

రుద్రూర్, బతుకమ్మ :

 

రుద్రూర్ మండలంలోని అక్బర్ నగర్ గ్రామంలో గల ప్రభుత్వ పాఠశాలలో జై జవాన్ ఫౌండేషన్ తరపున నియమించిన ఉపాధ్యాయురాలు మొదటి నెల గౌరవ వేతనాన్ని జై జవాన్ ఫౌండేషన్ ప్రతినిధి బిఎస్ఎఫ్ జవాన్ షేక్ ఎజాస్ అందజేశారు. ఈ సందర్భంగా షేక్ ఎజాస్ మాట్లాడుతూ.. గతంలో పేద విద్యార్థులకు స్కూల్ బ్యాగులు పంపిణీ చేయడం జరిగిందని అన్నారు. గ్రామంలో పేదలను గుర్తించి నిత్యవసర వస్తువులను సైతం పంపిణీ చేయడం జరిగిందని అన్నారు. పుట్టిన ఊరు కోసం, గ్రామంలోని పేద విద్యార్థుల విద్యాభివృద్ధి కోసం తమ వంతు కృషి చేస్తున్నట్లు ఆయన తెలియజేశారు. దేశ రక్షణతో పాటు ప్రజాసేవలో పాలుపంచుకుంటూ పుట్టిన ఊరి కోసం తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్న జై జవాన్ ఫౌండేషన్ సభ్యులకు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సీతారామరాజు, పాఠశాల ఉపాధ్యాయురాలు పద్మ అంగన్వాడీ టీచర్ సావిత్రి, విద్యా వాలంటీర్లు ఫౌజియా, అనుజ, గౌతమ్ కంబ్లె, రాజు, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.