- బియ్యం నగదును వితరణ చేసిన నాయకులు
- బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుంది
ఎల్లారెడ్డిపేట, బతుకమ్మ:రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని రాచర్ల బొప్పాపూర్ గ్రామంలో వారం రోజుల వ్యవధిలో చనిపోయిన కుటుంబాలను కాంగ్రెస్ పార్టీ నాయకులు శనివారం పరామర్శించారు. బోప్పాపూర్ గ్రామపంచాయతీలో వాటర్ మెన్ గా గత 20 సంవత్సరాల నుండి పనిచేస్తున్న మారుపాక బాల ఎల్లయ్య వారం రోజుల క్రితం గుండెపోటుతో అకాల మరణం చెందారు.మృతుని భార్య లక్ష్మి తండ్రి నరసయ్య తల్లి లక్ష్మి లను నాయకులు ఓదార్చారు. కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు చల్ల పద్మా రెడ్డి 25 కిలోల బియ్యం, కొండాపురం శ్రీనివాస్ రెడ్డి 25 బియ్యం వెయ్యి రూపాయల నగదు, తాజా మాజీ సర్పంచ్ కొండాపురం బాల్ రెడ్డి 50 కేజీల బియ్యం,మార్కెట్ డైరెక్టర్ కొంగరి కిష్టారెడ్డి 25 కిలోల బియ్యం వితరణ చేశారు.అలాగే నాలుగు రోజుల క్రితం ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఈరవేణి రమ్య కుటుంబ సభ్యులను పరామర్శించారు. భర్త కృష్ణ దుబాయ్ లో ఉండి బ్రతుకుదెరువు కోసం కూలి పని చేసుకుంటు కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. రమ్యకు పిల్లలు లాస్య 8, ప్రణయ్ 6,శశాంక్ 2,ఉండగా వీరి పరిస్థితిని నియోజకవర్గ ఇన్చార్జ్ కేకే మహేందర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా వారిని చదివిపించే బాధ్యత ప్రభుత్వం పక్షాన తీసుకుంటామని తెలిపారు.ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నర్సయ్య,మండల అధ్యక్షుడు సద్ది లక్ష్మారెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు షేక్ గౌస్,మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షుడు గుండాడి రామ్ రెడ్డి,జిల్లా కిసాన్ సెల్ ఉపాధ్యక్షుడు మర్రి శ్రీనివాస్ రెడ్డి, నాయకులు మెండే శ్రీనివాస్,గంట బుచ్చా గౌడ్,మారుపాక సత్యం, బాల పోశయ్య ,ఇల్లందుల రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

