ముప్కాల్, బతుకమ్మ : ముప్కాల్ లోని శ్రీ భక్త మార్కండేయ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో మార్కండేయ జయంతిని శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బాల్కొండ నియోజకవర్గం వర్కింగ్ ప్రెసిడెంట్ జోగు నరసన్న మాట్లాడుతూ పద్మశాలీలకు మార్కండేయ జయంతి ఎంతో ముఖ్యమైన రోజు అని అన్నారు. మార్కండేయ జయంతి సందర్భంగా ప్రభుత్వం సెలవుదినంగా ప్రకటించాలని, మార్కండేయ జయంతిని అధికారికంగా నిర్వహించాలని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో జనాభాపరంగా మూడవ స్థానంలో ఉన్నటువంటి పద్మశాలీలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం బాల్కొండ నియోజకవర్గం వర్కింగ్ ప్రెసిడెంట్ జోగు నరసన్న (రవీంద్ర ), జిల్లా పద్మశాలి సంఘం కార్యదర్శి గురుడు దయానంద్, ముప్కల్ మండల పద్మశాలి సంఘం అధ్యక్షులు బ్రహ్మదండి లింగం, పద్మశాలి సంఘం అధ్యక్షులు చిలుక గోపాల్, బ్రహ్మదండి చిన్నయ్య, చిలుక సుదర్శన్, సంఘ పెద్ద మనుషులు సంఘ సభ్యులు పాల్గొన్నారు.
