27.4 C
Hyderabad

సిఇసీ జ్ఞానేశ్ కుమార్‌పై క్రిమినల్ దర్యాప్తు చేయండి

Conduct a criminal investigation against CEC Gyanesh Kumar.

Must read

📰 Generate e-Paper Clip

 

. . . సుప్రీం కోర్టులో ఫీల్ దాఖలు

 వెబ్ డెస్క్, బతుకమ్మ :

చీఫ్ ఎలక్షన్ కమిషనర్  జ్ఞానేశ్ కుమార్‌పై క్రిమినల్ దర్యాప్తు చేయండి అని సుప్రీంకోర్టులో అడ్వకేట్ శైలేంద్ర మని త్రిపాఠి పిల్ దాఖలు చేశారు. జ్ఞానేశ్ ఏక‌ప‌క్షంగా వ్యవ‌హ‌రిస్తూ త‌న బాధ్యతల్ని ఉల్లంఘించారని పిల్‌లో ఆరోపణలు చేశారు. సీఈసీ తీసుకున్న నిర్ణయాలు, మార్గద‌ర్శకాలు, సూచ‌న‌లు, సాఫ్ట్ వేర్ మార్పుల‌ను త‌క్షణ‌మే ర‌ద్దు చేయాల‌ని డిమాండ్ చేశారు. ఇద్ధరు ఎన్నిక‌ల క‌మీష‌న‌ర్ల ఆమోదం లేకుండా జ్ఞానేశ్ తీసుకున్న నిర్ణయాల‌ను కొట్టివేయాల‌ని పిల్‌లో వెల్లడించారు. ఓట‌ర్ల రివిజ‌న్ ప్రక్రియ కోసం అనేక నిర్ణయాల‌ను త‌మ ఆమోదం లేకుండానే జ్ఞానేశ్ తీసుకున్నట్టు ఇద్దరు ఎన్నికల కమీషనర్ల ఆరోపణలు, స‌ర్ ప్రక్రియ‌తో సంబంధం ఉన్న అంశాల్లో 14 సార్లు సీఈసీ జ్ఞానేశ్‌ను సుఖ్‌బీర్ సింగ్ సంధూ, వివేక్ జోషి వ్యతిరేకించిన‌ట్లు వెలుగులోకి! ఓట‌ర్ల జాబితా స‌వ‌ర‌ణ పేరుతో.. అక్రమ రీతిలో ఓట్లను సైతం డిలీట్ చేసిన‌ట్లు జ్ఞానేశ్ కుమార్‌పై ఆరోప‌ణ‌లున్నాయి.

More articles

Latest article