31.4 C
Hyderabad

వీడీసీలను రద్దు చేయాలి

VDCs must be abolished

Must read

📰 Generate e-Paper Clip

 

 . . . సీపీఐ జిల్లా కార్యదర్శి పి.సుధాకర్ డిమాండ్

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :

గ్రామాలలో గ్రామాభివృద్ది కమిటీలను రద్దు చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి సుధాకర్ డిమాండ్ చేశారు. శనివారం సిపిఐ జిల్లా కార్యాలయానికి విచ్చేసిన తాళ్ల రాంపూర్ బాధితులతో ఆయన మాట్లాడారు. బాల్కొండ నియోజకవర్గంలో విడిసి (గ్రామాభివృద్ధి కమిటీ)ల ఆగడాలు మితిమీరుతున్నాయని గతంలో తాళ్ల రాంపూర్ లో వీడీసీ సభ్యులు చేసిన తప్పులకు ఇప్పుడు పోలీస్ శాఖ వారు నోటీసులు ఇస్తే ఇట్టి నోటీసులను ఆసరా చూయించి గత నాలుగు రోజులు కిందట ఏర్గెట్ల మండలం తాళ్ల రాంపూర్ కు చెందిన 32 గీతా కార్మిక కుటుంబాలు, 12 దళిత కుటుంబాలను గ్రామ బహిష్కరణ చేయడం అన్యామని, రాజ్యాంగం ద్వారా ఏర్పాటు అయిన ప్రజాస్వామ్యం కాకుండా స్థానికంగా వీడీసీల పేరుతో ఆధిపత్యం చలాయిస్తూ కొన్ని వర్గాల వారిపై అన్యాయంగా గ్రామ బహిష్కరణ చేస్తుంటే స్థానిక ప్రజాప్రతినిధులు, చట్టం ఏం చేస్తుందని అన్నారు. ఇప్పటికైనా వీడీసీలు చేస్తున్న అన్యాయాలను గుర్తించి వీడీసీలను రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ సమావేశంలో సిపిఐ జిల్లా నాయకులు బి.రఘురాం, ఫిరోజ్ ఆలీ,బీవీఎం రాష్ట్ర కోఆర్డినేటర్ బట్టు శ్రీధర్, వీడీసీ బాధితులు సుదర్శన్,ఉత్కం నర్సాగౌడ్, దిబ్బ, దేవదాస్,  లింగాల, శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు.

More articles

Latest article