భీంగల్, బతుకమ్మ : ఈనెల 7న నిర్వహించే వేల గొంతులు లక్షల డప్పులు మహా సాంస్కృతిక ప్రదర్శనను విజయవంతం చెయ్యాలని కరపత్రాలు, గోడ ప్రతులు శనివారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాన్ని భీంగల్ మండల ఇంచార్జి మంద ప్రభాకర్ మాదిగ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు సరికేల పోశెట్టి మాదిగ, ఎంఈఎఫ్ జాతీయ నాయకులు తేడు గంగారాం మాదిగ హాజరై మాట్లాడారు. ఫిబ్రవరి 7న జరిగే వేల గొంతులు లక్షల డప్పులు మహా ప్రదర్శనను భీంగల్ మండలం నుంచి వేలాదిగా డప్పులతో బయల్దేరి విజయవంతం చెయ్యాలని పిలుపునిచ్చారు. అలాగే ప్రతి గోడ ప్రతి జిల్లాలో ఉన్న ప్రతి గ్రామానికి చేరేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి మాదిగ ఇంటికి కరపత్రం చేరేలా చూడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్పీజిల్లా ప్రధాన కార్యదర్శి మంద ప్రభాకర్ మాదిగ,చెప్పాల గణేష్ మాదిగ జె జె నర్సయ్య మాదిగ లక్ష్మణ్ మాదిగ తేడు అశోక్ మాదిగ రాజన్న మాదిగ గంగాధర్ భీంగల్ గ్రామ పెద్దలు నాయకులు మరియు తదితరులు పాల్గొన్నారు.
