తెలంగాణ రక్షణ సేన బలోపేతానికి కృషి చేయాలి

0 9,638

 

. . . కామారెడ్డి ఇంచార్జ్ నంగునూరి రవీందర్ గుప్తా

 

కామారెడ్డి, బతుకమ్మ :

 

కామారెడ్డి నియోజకవర్గంలో తెలంగాణ రక్షణ సేనను గ్రామ స్థాయి నుంచి బలోపేతం చేసేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని తెలంగాణ రక్షణ సేన కామారెడ్డి నియోజకవర్గ ఇన్‌చార్జి నంగునూరి రవీందర్ గుప్తా పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని అన్ని మండలాలు, గ్రామాల్లో పార్టీ కమిటీలను ఏర్పాటు చేసి వాటిని మరింత పటిష్ఠం చేస్తామని తెలిపారు. ప్రజా సమస్యలపై పార్టీ నిరంతరం పోరాడుతూ ప్రజలకు అండగా ఉంటుందని పేర్కొన్నారు. కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమయ్యారని రవీందర్ గుప్తా ఆరోపించారు. అలాగే కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించడం లేదని విమర్శించారు. అనేక ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజల పనులు సకాలంలో జరగడం లేదని, దీనివల్ల సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన అన్నారు. తెలంగాణ రక్షణ సేన ప్రజా సంక్షేమాన్ని లక్ష్యంగా పెట్టుకుని “పంచ జన్యం” పేరుతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ముందుకు సాగుతోందని చెప్పారు. భవిష్యత్తులో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తామని ఆయన వెల్లడించారు. ఈ మీడియా సమావేశంలో పార్టీ నాయకులు అరుణ్, మధు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.