26.2 C
Hyderabad
Monday, August 3, 2026

మున్సిపల్ సానిటేషన్ సిబ్బందికి రేడియం జాకెట్ల పంపిణీ

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, భీమ్ గల్ : స్వచ్ఛతా హి సేవా కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ సానిటేషన్ వర్కర్స్ కు రేడియం జాకెట్లను మున్సిపల్ చైర్ పర్సన్  కన్నె ప్రేమలత సురేందర్ శనివారం పంపిణీ చేశారు. చైర్మన్ కౌన్సిలర్ తో కలిసి సానిటేషన్ సిబ్బందికి రెయిన్ కోట్లు, గ్లౌసులు,బూట్లను అందజేశారు. అనంతరం సిబ్బందికి డాక్టర్. అజయ్ పవర్ ఆధ్వర్యంలో వైద్య పరీక్షలను నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ మాట్లాడుతూ తప్పనిసరిగా రేడియం జాకెట్లు ధరించాలని అన్నారు. పనిచేసే ప్రదేశాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ గున్నాల బాలభగత్, కౌన్సిలర్ ధారావత్ లింగయ్య, సిహెచ్ గంగాధర్, నాయకులు డాక్టర్ ముత్తెన్న,అబ్దుల్ రజాక్, మల్లెల ప్రసాద్, కో ఆప్షన్ సభ్యులు అజ్మతుల్లా, మున్సిపల్ కమిషనర్ వై. రామకృష్ణ, మేనేజర్. వార్డ్ ఆఫీసర్. కె. నవీన్, ఇన్చార్జ్ శానిటరీ ఇన్స్పెక్టర్ ఓంకార్, జవాన్ రాజయ్య, మున్సిపల్ వర్కర్స్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article